Samantha : నన్ను బాధ పెట్టావ్.. కాలమే నీకు సమాధానం చెబుతుంది.. చైతుకు సామ్ వార్నింగ్ ?

by Anukaran |   ( Updated:2021-09-23 05:03:33.0  )
Samantha : నన్ను బాధ పెట్టావ్.. కాలమే నీకు సమాధానం చెబుతుంది.. చైతుకు సామ్ వార్నింగ్ ?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటే గుర్తుకు వచ్చే పేరు నాగచైతన్య సమంత. కానీ, చాలా రోజుల నుంచి అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో గుసగుసలు వినబడుతున్న విషయం తెలిసిందే. సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్‌‌లో అక్కినేని ఇంటి పేరును తొలిగించి ఎస్ అనే అక్షరం జోడించడంతో ఈ గుసగుసలకు ఆజ్యం పోసినట్టైంది. అప్పటి నుంచి సమంత నాగచైతన్య విడాకుల టాపిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కానీ ఇవేమి పట్టించుకోకుండా చైతన్య సమంత వారి వారి పనులలో బిజీగా ఉన్నారు. ఈ రూమర్స్‌పై చైతన్య, సమంత ఎవరూ స్పందించకపోవడంతో అక్కినేని అభిమానుల్లో రోజు రోజుకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. కానీ ఈరూమర్స్‌పై సమంత రోజుకో రకమై ట్వీట్స్‌తో హింట్ ఇస్తున్నా.. నాగచైతన్య మాత్రం స్పందించడం లేదు. అయితే తాజాగా సమంత చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.. ఈ ఒక్క ట్వీట్‌తో వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నవి నిజమేనేమో అనే అనుమానాలు అభిమానుల్లో కలుగుతున్నాయి.

చైతన్యతో సమంత విడాకులు ఫిక్స్.. భరణంగా అన్ని కోట్లు..?

సమంత తాజాగా షేర్ చేసిన ఇంగ్లీష్ కొటేషన్స్ వైరల్ అవుతున్నాయి. అవి నాగ చైతన్యను ఉద్దేశించి చేసినవేనా? అనే అనుమానం కలుగుతోంది. నువ్వు నన్ను బాధపెట్టి వుండొచ్చు..నేను నిన్ను బాధ పెట్టి వుండొచ్చు. ఒకరిని ఒకరం బాధ పెట్టుకుని వుండొచ్చు. మొత్తానికి రియాల్టీ ఇదే.. అంటూ సామ్ కొటేషన్స్ పోస్ట్ చేసింది. ఇక కాలమే దీనికి సమాధానం చెప్తుంది అన్న రీతిలో మరో పోస్ట్ పెట్టింది. వసంత కాలాన్ని పొందాలంటే శిశిరాన్ని కూడా భరించాలి అంటూ తన ప్రస్తుత పరిస్థితిని చెబుతోన్నట్టు మరో పోస్ట్ పెట్టింది సామ్. దీంతో అక్కినేని అభిమానులు ఆందోళన మొదలైంది. ఇన్ని రోజుల నుంచి వస్తున్న పుకార్లకు సమంత హింట్ ఇచ్చిందని, అందుకే సమంత ఈ కొటేషన్స్ ద్వారా చైతన్యకు వార్నింగ్ ఇచ్చిందని కొందరు అనుకుంటున్నారు. అయితే జనాలకి ఒక క్లారిటీ ఇవ్వకుండా ఇన్ డైరెక్ట్ విమర్శలతో సమంతకే కాదు.. అక్కినేని ఫ్యామిలీకి అగౌరవమే అంటున్నారు మరికొందరు. మరీ ఈ అనుమానాలు తీరాలన్నా, పుకార్లకు చెక్క పెట్టాలన్న సమంత, చైతన్య ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాలంటున్నారు అభిమానులు. మరీ వీరు ఎప్పుడు పెదవి విప్పుతారో, ఎప్పుడు ఈ పుకార్లకు చెక్ పడుతుందో వేచి చూడాలి.

నాగార్జున అలా చేశారు.. దెబ్బకు దిగొచ్చిన అక్కినేని కోడలు.. డివోర్స్‌పై క్లారిటీ.!

Advertisement

Next Story

Most Viewed