- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విండీస్ బాటలో ఇంగ్లండ్
దిశ, స్పోర్ట్స్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత జాతి వివక్షపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. క్రికెట్‌లో కూడా జాతి వివక్ష ఉందని పలువురు క్రీడాకారులు ఆరోపించారు. ఈ నెల 8 నుంచి ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టెస్టులో జాతి వివక్షను నిరసిస్తూ జెర్సీ కాలర్లపై ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అనే లోగోతో ఆడుతామని విండీస్ ఆటగాళ్లు ప్రకటించారు. వీరి ప్రతిపాదనకు ఐసీసీ కూడా అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు కూడా విండీస్ బాటలోనే నడవాలని నిర్ణయించింది. విండీస్ ఆటగాళ్లతోపాటు తాము కూడా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అని ముద్రించిన లోగోతో బరిలోకి దిగుతామని స్పష్టం చేసింది. ఈ నెల 8 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకే లోగోతో బరిలోకి దిగి జాతి వివక్షపై అవగాహన కల్పించనున్నారు. నల్లజాతీయులకు సంఘీభావం తెలుపడంతోపాటు వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జోరూట్ తెలిపాడు. ‘నల్లజాతీయులకు సంఘీభావం తెలుపడంతోపాటు సమానత్వం, సమన్యాయంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’అని ఆయన అభిప్రాయపడ్డాడు.