టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన

by Shiva |
టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
X

దిశ, స్పోర్ట్స్ : భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు టెస్టు సిరీస్ అనంతరం టీ20 సిరీస్ ఆడనున్నది. మార్చి 12 నుంచి 20 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు అహ్మదాబాద్ వేదికగా జరుగనున్నాయి. 3, 4 టెస్టు మ్యాచ్‌లు కూడా అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలోనే నిర్వహించనున్నారు. అనంతరం ఐదు టీ20లు కూడా అదే స్టేడియంలో జరుగుతాయి. కాగా, మొత్తం 16 మందితో కూడిన టీ20 జట్టును ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. టెస్టు జట్టులో లేని టీ20 ఆటగాళ్లు అందరూ ఈ నెల 26న అహ్మదాబాద్ చేరుకుంటారు. ఇక పూణేలో జరగబోయే మూడు వన్డే మ్యాచ్‌లకు జట్టును తర్వాత ప్రకటిస్తారు.

ఇంగ్లాండ్ టీ20 జట్టు

ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో (కీపర్), సామ్ బిల్లింగ్స్, జాస్ బట్లర్, సామ్ కర్రన్, టామ్ కర్రన్, క్రిస్ జోర్డన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, మార్క్ వుడ్

రిజర్వ్ ఆటగాళ్లు

జేక్ బాల్, మాట్ పార్కిన్సన్

Advertisement

Next Story