- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: ఎస్ఐ, నలుగురు మావోలు మృతి
దిశ, కరీంనగర్: ఛత్తీస్‌గడ్‌లోని రాజ్‌నందగావ్ జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఎస్సై, నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మదన్వార స్టేషన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోలు కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ చేపట్టాయి. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో స్థానిక ఎస్సై శ్యామ్ కిషోర్ శర్మ నేతృత్వంలో బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. బలగాల రాకను గమనించిన మవోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతీకారంగా పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు రాజ్‌నంద్‌గావ్ ఎస్పీ జితేంద్ర శుక్లా మీడియాకు వెల్లడించారు. ఘటనా స్థలంలో రెండు ఎస్‌ఎల్‌ఆర్, ఒక ఏకే-47, ఇన్‌సాస్ రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్యామ్ కిషోర్ కడుపులోకి బుల్లెట్ దిగడంతో ఆయన కూడా చనిపోయినట్లు ఎస్పీ తెలిపారు.
Tags: encounter, Chhattisgarh, police, Maoists, crime news