నిరుపేద పిల్లల జీవితాల్లో.. కొత్త ఫ్రేమ్ ఆవిష్కరించిన ఆర్య!

by Shyam |
Empowered by photography
X

దిశ, ఫీచర్స్ : జంతువులు ఫొటోలు తీయడం కాస్త కష్టమే కానీ పర్‌ఫెక్ట్‌గా షూట్ చేస్తే.. చూసేందుకు భలే ఉంటాయి. ఇలాంటి రియలిస్టిక్ చిత్రాలు క్యాప్చర్ చేయడంలో గురుగ్రామ్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ ఆదిత్య ఆర్య ఎక్స్‌పర్ట్. ఫొటోగ్రఫీ చరిత్ర, కళకు సంబంధించి ‘మ్యూజియో కెమెరా’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించిన ఆదిత్య.. ఈ ఆర్ట్‌ను చిన్నారులకు నేర్పించేందుకు గురుగ్రామ్‌లోని శిక్షా ఎడ్యుకేషన్ సెంటర్‌లో వర్క్ షాప్ నిర్వహించాడు. ఈ క్రమంలో 15 మంది పిల్లలకు ఫొటోగ్రఫీపై శిక్షణనిచ్చి, ఆ పిల్లలు తీసిన ఫొటోలతో ఇటీవలే ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు.

ఇండియా సహా ప్రపంచ దేశాలు పాండమిక్ పరిస్థితుల నుంచి బయటకొస్తున్న టైమ్‌లో.. 15 మంది నిరుపేద చిన్నారులు ఆర్య ఆధ్వర్యంలో ఐఫోన్ 12sతో ఫొటోగ్రఫీ మెళకువలు నేర్చుకున్నారు. 15-20 రోజుల ట్రైనింగ్ సెషన్‌లో భాగంగా ఉదయంపూట బ్రీఫింగ్ తర్వాత షూటింగ్‌కు వెళ్తారు. ఆ తర్వాత వారికి క్రిటిక్ సెషన్ ఉంటుంది. పేదకుటుంబాలకు చెందిన పిల్లల కోసం ఆర్యతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గురుగ్రామ్‌లోని సాంస్కృతిక సంస్థ.. ఈ ప్రోగ్రామ్ కోసం 15 ఐఫోన్ కెమెరాలను వారికి అందజేసింది. కాగా ‘పిల్లల్లో దాగున్న శక్తిని ఇలాంటి వర్క్‌షాప్స్ ప్రపంచం ముందుకు తీసుకొస్తాయి. వాళ్లు నేర్చుకునేందుకు మనం నిజంగా బోధించాల్సిన అవసరం లేదు. వాళ్లే స్వయంగా నేర్చుకునేలా గైడ్ చేస్తే సరిపోతుంది’ అని ఆర్య తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక లక్షల విలువ చేసే కెమెరా కొనాల్సిన అవసరం తగ్గింది. ఈ పిల్లలు ట్రైనింగ్‌లో ఎపర్చర్, షట్టర్ స్పీడ్, కంపోజిషన్ వంటి కెమెరా వ్యాకరణాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది దృశ్య భాష. ఓ ఆబ్జెక్ట్‌తో మీరు కమ్యూనికేట్ చేసేందుకు, మీ కోణం నుంచి దాన్ని ఎలా చూస్తున్నారని విషయంలో సాయపడే ఒక సాధనం మాత్రమే. ఆయా వ్యక్తుల అంతర్‌దృష్టిని ఇది బయటకు తీసుకొస్తుంది. రోజువారీ జీవితాన్ని కెమెరా కోణం నుంచి విభిన్నంగా చూడటం ఓ కళ. ఇకపై ఈ విద్యార్థులంతా వారి వారి ప్రపంచంలో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను.

– ఆదిత్య ఆర్య, ఫొటోగ్రాఫర్

photography

Advertisement

Next Story

Most Viewed