విద్యుత్ ఉద్యోగులు తప్పనిసరిగా ఐడీ కార్డు ధరించాలి

by Shyam |
CMD Raghumareddy,
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఐడెంటెటీ కార్డులు ధరించాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లాక్ డౌన్ లో సమయంలో పోలీసుల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఈ నియమాన్ని అందరూ పాటించాలని ఆయన స్పష్టం చేశారు. నిరంతరం విద్యుత్ సరఫరా అందించటంలో భాగంగా ఉద్యోగులు, కార్మికులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తుంటారని, వారిని అత్యవసర సర్వీసుగా భావించి లాక్ డౌన్ ఆంక్షల నుంచి మినహాయించనట్లు ఆయన తెలిపారు.

నల్లగొండ పట్టణంలో శనివారం పోలీస్ సిబ్బంది విద్యుత్ శాఖ కార్మికుడిపై దాడి చేసిన ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారని, ఈ విషయమై డీజీపీతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు. విద్యుత్ ఉద్యోగులు తమ వాహనాలపై సంస్థకు చెందిన స్టిక్కర్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, ఈ బాధ్యతలను సూపరింటెండెంట్ ఇంజినీర్లు పర్యవేక్షించాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed