- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బైపోల్ ఎఫెక్ట్.. ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు షాకింగ్ న్యూస్
దిశ, కరీంనగర్ సిటీ: హుజూరాబాద్ బై పోల్ నేపథ్యంలో జిల్లాలోని ఇతర సెగ్మెంట్ల పరిధిలో నిర్వహించే ఎన్నికల ప్రచార ఖర్చును కూడా ఆయా అభ్యర్థుల ఖాతాల్లో లెక్కిస్తామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. ఆ నియోజకవర్గ పరిధిలోని వివిధ బ్యాంకుల్లో రూ. లక్షకుపైగా అకౌంట్‌ల నుంచి లావాదేవీలు జరిపితే సదరు ఖాతాలపై నిఘా పెంచి, తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయ పరిశీలకులతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల ప్రచార ఖర్చులు, నిర్వాహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లను ప్రభావితం చేయుటకు ఓ అకౌంట్ ద్వారా వివిధ అకౌంట్లకు యూపీఐ ద్వారా గూగుల్ పే, ఫోన్ పే ఇతర యాప్‌లతో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినచో వాటి పై కూడా నిఘా ఉంచి సంబంధిత పార్టీల పై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉప ఎన్నికను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.