వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

by Shyam |
వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్
X

దిశ, మెదక్: కరోనా వ్యాధి సోకకుండా వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. ఈ మేరకు వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాన్ని కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధి జిల్లాలో అదుపులోనే ఉందన్నారు. జిల్లాలో మొత్తం 44 మంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి, ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Tags: Elderly, care best, against coronavirus, Collector dharma reddy, medak

Advertisement

Next Story