- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్ ఖాన్‌కు ‘ఎలన్ మస్క్’ 5 మిలియన్ డాలర్ల సాయం
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా మోటార్స్ అధినేత ఎలన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఖాన్ అకాడమీకి 5 మిలియన్ డాలర్స్ (రూ.36 కోట్లు) విరాళం ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకివెళితే.. సల్మాన్ అమిన్ ఖాన్ అనే ఆసియా మూలాలు కలిగిన వ్యక్తి అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డాడు. 2008లో ఖాన్ అకాడమీ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి, దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు లాభాపేక్ష లేని చదువును అందిస్తున్నాడు. అందుకోసం మల్టిపుల్ లాంగ్వేజీలతో కూడిన వీడియోలను స్టూడెంట్స్‌కు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నాడు.ఈ అకాడమీకి సీజిల్ ఫ్యామిలీ ఎండోమెంట్ స్పాన్సర్‌గా కొనసాగుతోంది.
Thank you @elonmusk and @MuskFoundation for an incredible $5m donation to @khanacademy. Here is my thank you video:https://t.co/1LyABVmTyt
— Salman Khan (@salkhanacademy) January 12, 2021
ఈ నేపథ్యంలోనే సల్మాన్ అమిన్ ఖాన్ టెస్లా మోటర్స్ అధినేత ఎలన్a మస్క్‌ను తమ అకాడమీకి సాయం అందించాలని కోరాడు. దీని ద్వారా చాలా మందికి విద్యార్థులకు సాయం అందించిన వారవుతారని అందులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆయన 5 మిలియన్ డాలర్స్ ను విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఖాన్ స్వయంగా వీడియో రూపంలో చిత్రీకరించి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. భారీ మొత్తంలో ఖాన్ అకాడమీకి సాయం అందించడం పట్ల ఆనందం వ్యక్తంచేయడమే కాకుండా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియా కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.