నీట్ పీజీ - 2023 నోటిఫికేషన్ విడుదల

by Harish |   ( Updated:2023-01-09 18:08:01.0  )
నీట్ పీజీ - 2023 నోటిఫికేషన్ విడుదల
X

దిశ, ఎడ్యుకేషన్: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎంఎస్) 2023 సంవత్సరానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎండీ/పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సు వివరాలు:

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ - 2023

అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ/ప్రొవిజనల్ ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.

మార్చి 31 నాటికి ఏడాది ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: జనవరి 27, 2023.

పరీక్ష తేదీ: మార్చి 5, 2023.

వెబ్‌సైట్: https://natboard.edu.ఇన్

READ MORE

నీట్ ఎండీఎస్ 2023 ప్రకటన విడుదల

Advertisement

Next Story

Most Viewed