పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

by Vinod kumar |
పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?
X

దిశ, కెరీర్: ఏపీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో.. 21 ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అర్హులైన దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆటో మొబైల్‌ ఇంజినీరింగ్‌, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టిస్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్‌ తదితర సబ్జెక్టుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం పోస్టుల - 21

పోస్టుల వివరాలు:

ఆటో మొబైల్ ఇంజినీరింగ్ - 2

కమర్షియల్ అండ్‌ కంప్యూటర్ ప్రాక్టీస్ - 1

కెమికల్ ఇంజినీరింగ్ - 1

సివిల్ ఇంజినీరింగ్ - 5

ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ - 1

ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ - 4

ఇంగ్లిష్ - 3

మ్యాథ్స్‌ - 1

మెకానికల్ ఇంజినీరింగ్ - 2

మైనింగ్ ఇంజినీరింగ్ -1

విద్యార్హతలు:

సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, పీజీలో ఫస్ట్‌ క్లాస్‌ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

కమర్షియల్ అండ్‌ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్‌ టైప్‌ రైటింగ్‌ హయ్యర్ గ్రేడ్, షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.

దివ్యాంగ అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయసు: జులై 1, 2023వ తేదీనాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ప్రారంభతేదీ: ఏప్రిల్‌ 27, 2023.

చివరితేదీ: మే 17, 2023

దరఖాస్తు ఫీజు: రూ.250 చెల్లించాలి

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

వెబ్‌సైట్: https://psc.ap.gov.in/

Advertisement

Next Story