- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనుషులం ఇంతగా వేరైపోయామా!
రెండు భిన్న మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని సంక్షోభంలోకి నెట్టేసి, ఈనాటి మన సమాజ స్వరూపాన్ని క్రాస్ సెక్షన్‌లో చూపిస్తుందీ చిత్రం. కథ చాలా సరళంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉండి ఉద్యోగం చేస్తున్న ఒక ఆధునిక యువకుడు, సుదీర్ఘ రైలు ప్రయాణం తర్వాత అతను ముంబై రైల్వే స్టేషన్‌లో దిగుతాడు. టాక్సీ మాట్లాడుకుంటాడు. టాక్సీ డ్రైవర్ సామానంతా టాక్సీలో కొంతా, టాక్సీపైన కొంతా తాళ్లతో కట్టి చక్కగా సహాయం చేస్తాడు. వారు చెప్పిన అడ్రస్‌కి పోతున్న ప్రయాణంలో వారు స్నేహభావంతో ఉంటారు.
ఆవిరైపోయిన స్నేహభావం
టాక్సీ ఫలానా రోడ్‌కి చేరుకున్నాక ఇంటి అడ్రస్ చెప్తాడు కస్టమర్. అది ముస్లింలు నివసించే ప్రాంతమని గ్రహిస్తాడు డ్రైవర్. ఇక ఇప్పటి వరకూ ఉన్న స్నేహాభావమంతా ఆవిరైపోయి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందంటారే అలా గట్టి విరోధంగా మారిపోతుంది. ఇంతకంటే ముందుకి వెళ్లనని, అక్కడి జంక్షన్‌లో దింపే స్తాను, దిగి వెళ్ళిపొమ్మని నిర్మొహమాటంగా చెప్తాడు టాక్సీడ్రైవర్. ఇక ఘర్షణ మొదలవుతుంది. అది ఇద్దరు వ్యక్తుల మధ్య – రెండు మతాల ఆధారంగా యుద్ధభూమిని తలపించే శత్రుపూరితమైన సంఘర్షణగా మారుతుంది.
ఆవిరైపోయిన స్నేహభావం
టాక్సీ ఫలానా రోడ్‌కి చేరుకున్నాక ఇంటి అడ్రస్ చెప్తాడు కస్టమర్. అది ముస్లింలు నివసించే ప్రాంతమని గ్రహిస్తాడు డ్రైవర్. ఇక ఇప్పటివరకూ ఉన్న స్నేహాభావమంతా ఆవిరైపోయి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందంటారే అలా గట్టి విరోధంగా మారిపోతుంది. ఇంతకంటే ముందుకి వెళ్లనని, అక్కడి జంక్షన్‌లో దింపేస్తాను, దిగి వెళ్ళిపొమ్మని నిర్మొహమాటంగా చెప్తాడు టాక్సీడ్రైవర్. ఇక ఘర్షణ మొదలవుతుంది. అది ఇద్దరు వ్యక్తుల మధ్య – రెండు మతాల ఆధారంగా యుద్ధభూమిని తలపించే శత్రుపూరితమైన సంఘర్షణగా మారుతుంది.
నిన్ను నావాడివే అనుకున్నాను..
అతనొక ముస్లిం అని తెలిశాక అతన్ని ఇంటి దగ్గర దింపడం కుదరదంటే కుదరదని, “చెప్తుంటే అర్థం కాదా” అంటూ చాలా అమర్యాదగా, కర్కశంగా ప్రవర్తిస్తూ సామా నంతా రోడ్డుమీదకి విసిరికొట్టి తక్షణం దిగి పొమ్మంటాడు. 'నేను ఇంటి అడ్రస్‌కి బుక్ చేసుకున్నాను, నడిరోడ్డులో బండెడు సామా నుతో దిగి వెళ్లడం సాధ్యపడద'ని అతని వాదన. ఏదైతే అదవుతుందని అతను సీట్లో నుంచి కదలకుండా ఉడుంపట్టు పట్టినట్లు భీష్మించుకుని కూర్చుంటాడు. నిమిషాలు, గంటలు గడుస్తుంటాయి. ఇద్దరి మధ్యా వాతావరణం స్తంభించిపోతుంది. చూస్తున్న ప్రేక్షకులకు కూడా నిమిష నిమిషానికీ ఉత్కంఠ పెరిగిపోతుంటుంది. చీకటి పడబోతుంది. బోలెడంత టైమే కాదు, సంపాదించుకోవలసిన ఆదాయం కూడా రాకుండా నష్టపోతున్నానని గ్రహించి, చివరికి ఆ డ్రైవరే రోడ్డు మీద అంతకుముందు దౌర్జన్యంగా పడేసిన సామానంతా సర్ది అతన్ని ఇంటి అడ్రస్‌కి తీసుకెళ్లి దింపుతాడు. కస్టమర్ నుండి డబ్బు తీసుకుంటూ, “నువ్వెందుకు నా రోజంతా వృధా చేశావ్ మీ మతంవాడి బండి ఎక్కవలసింది కదా” అని అడుగుతాడు డ్రైవర్. డబ్బు చెల్లిస్తూ “నిన్ను నావాడివే అనుకున్నాను” అని చెప్తాడు కస్టమర్!
మేము - మీరు.. ఎంతకాలమిలా వేరుపడడం?
సీన్ కట్ చేస్తే, ఇంట్లో వాళ్లందరూ అతడి రాకతో సందడి చేస్తూ సంబరంగా ఉంటే ఆత్రంగా ఇంటికొచ్చిన అతడు మాత్రం పరిసరాలు పట్టనట్లు, మనసు మనసులో లేనట్లు పుట్టెడు విచారంతో బిక్కచచ్చినట్లు ఉంటాడు. బాల్యంనుంచి తాను చూసిన తన నగరం ఇంత ఘోరంగా “మేము – మీరు” గా వేరుపడి పోవడాన్ని అతడు జీర్ణించుకోలేకపోతుంటాడు. కొన్ని గంటలపాటు తాననుభవించిన మానసిక క్షోభ, తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోయి అతడు మామూలు మనిషి కాలేకపోతుంటాడు. ఇంకోచోట ఒక హోటల్‌లో భోజనం ఆర్డర్ చేసిన టాక్సీడ్రైవర్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంటుంది. భోజనం ప్లేట్ ముందు కూర్చుని తెగని ఆలోచనల్లో మునిగిపోతాడు. సహజంగా ప్రతిమనిషిలో ఉండే మనిషితనం వల్ల “నిన్ను నావాడివే అనుకున్నాను” అన్న కస్టమర్ మాట గుండెల్లో సూటిగా గుచ్చుకుందేమో! సరే, వాళ్లిద్దరూ ఆ సంఘటన వాడినీ, వేడినీ ప్రత్యక్షంగా అనుభవించినవాళ్లు. కానీ ప్రేక్షకులకు మొత్తంగా ఒకేసారి షాక్ తగిలినట్లు పిన్ డ్రాప్ సైలెన్స్!
నోట మాట రాలేదు..
కోల్‌కతా ఫిల్మోత్సవ్ ఆడియన్స్‌లో ఆనంద్ పట్వర్ధన్, అరుంధతీ రాయ్, సంజయ్ కాక్ వంటి వారితో పాటు ఇంకా నాకు పేర్లు తెలియని డైరెక్టర్లు, ఎంతోమంది ప్రముఖులున్నారు. ఎవరికీ నోటమాట రాలేదు! కొన్నిసార్లు కొన్ని సంఘటనలు ఎక్కడో జరుగుతాయి. మనకేమీ సంబంధం లేదనుకుంటాం. మన పక్కనే జరగకపోయినా మొత్తం చట్రంలో భాగంగా మనకూ ఆ సెగ తగిలి తీరుతుంది! కథ ఇంతే! కానీ కథనాన్ని అద్భుతంగా మలిచాడు. 2024 జనవరి 24 నుంచి 28 వరకూ జరిగిన కోల్‌కతా పీపుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ లఘుచిత్రం చూసిన ప్పటినుంచి నా మనసులో తిష్ట వేసుకుని కూర్చుండిపోయింది. మిత్రులారా, ఆగస్టు 11న ఆదివారం మీరందరూ కూడా 'టూ వే స్ట్రీట్' అనే ఈ లఘుచిత్రాన్ని హైదరాబాద్‌లో కింద ఇచ్చిన అడ్రస్‌లో వీక్షించవచ్చు. అందరూ ఆహ్వానితులే..
తేదీ: 11.08-2024 (ఆదివారం)
సమయం: మధ్యాహ్నం 3 గం. నుండి రాత్రి 8.30 గం. వరకు
నిర్వహణ : కోల్‌కతాలోని 'ముందడుగు', ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ సదరన్ రీజియన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో
స్థలం : చాంప్స్ సీఏ అకాడమీ, 11-06-865, మెహబూబ్ రెసిడెన్సీ, రెడ్ హిల్స్, లక్డీకాపూల్
శివలక్ష్మి
మంచి సినిమా గ్రూప్ సభ్యులు
94418 83949