- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశ భవిష్యత్తు మార్చేది విద్యార్థులే!
విద్యా దానం మహాదానం. విద్య కొరకై అర్థించు వాడు విద్యార్థి. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా విద్యలు నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిని విద్యార్థి లాగే భావించాలి. కానీ నేడు విద్యార్థి అనే పదానికి పరిమితి కుదించి పాఠశాల, కాలేజీ, యూనివర్సిటీ లో చదివే విద్యార్థులుగా పిలుస్తున్నారు. పూర్వ కాలంలో ఐదు సంవత్సరాలు నిండి అక్షరాభ్యాసం చేసిన పిదప పాఠశాలలో నేర్చుకునే వారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. పట్టుమని రెండేళ్ల వయసు నుండే బచ్పన్ పాఠశాల, కిండర్ గార్డెన్, ప్లే స్కూల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. చిన్న వయసులోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమై బుడిబుడి అడుగులు వేయలేని వయసులో బడి బాట పట్టి పసివయసులోనే విద్యార్థిగా మారుతున్నారు. పలకా బలపం పట్టి అ,ఆ,ఇ,ఈ లు రాయవలసిన చేతులు పెన్ను, పేపర్ పట్టి ఎ,బి,సి,డి లు రాస్తున్నారు.
ప్రతి యేట నవంబర్ 17 ని అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటారు.1939లో సామ్రాజ్య విస్తరణ కాంక్షతో నాజీలను పొరుగు దేశాల మీదికి ఊసి గొల్పినాడు నియంత హిట్లర్. అపుడు వారు ఆక్రమించిన దేశం జకస్లొవెకియా. అక్కడ ప్రిజ్ నగరం లోని విశ్వవిద్యాలయంలోకి నాజీ సేనల ప్రవేశానికి విద్యార్థులు అడ్డుకున్నారు. తమ ప్రవేశాన్ని అడ్డుకున్న విద్యార్థుల మీద అత్యంత క్రూరంగా కాల్పులు జరిపి పదిమంది విద్యార్థి నాయకులను సంహరించి మరో 1200 మందిని నాజీలు సృష్టించిన ‘కాన్సంట్రేషన్ కాంప్’ అనే నరకంలోకి తరలించారు. ఆ దుర్ఘటన జరిగింది నవంబర్ 17న ఆ తర్వాత మూడేళ్లకు లండన్‌లో సమావేశమయిన అంతర్జాతీయ విధ్యార్థుల సమైక్య మండలి నాటి వీరోచిత విద్యార్థి పోరాటానికి, వారి బలిదానంకి గుర్తుగా నవంబర్ 17ను అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరపాలని తీర్మానించి అమలు చేసింది. గతంలో విద్యార్థుల పోరాటాన్ని కమ్యూనిస్టు ఉద్యమంలో భాగంగా సోవియట్ యూనియన్ మలచుకుని తన ప్రాబల్యం ఉన్న దేశాలలో నవంబర్ 17 ని ఘనంగా నిర్వహించింది.
విద్యార్థి అనే పదానికి అసలు అర్థం చూస్తే డిగ్రీ కోసం కాక వివేకం కోసం తపించే వారే నిజమైన విద్యార్థులు అని ప్రపంచం నేడు అంగీకరిస్తున్నారు. వయసుతో సంబంధం లేదు కాబట్టి వయోజన విద్య పథకం మొదలు అయినది. గృహిణి, ఉద్యోగి ఏ స్థాయిలో ఉన్నా, ఏ వయస్సులో వున్న వారు అయినా విద్యార్థిగా ఆలోచించ వచ్చునన్నది నేటి భావన. తెలివి, సంపాదించడం, అది కూడా సక్రమ మార్గంలో ఉండడం, కృషి, పట్టుదల, క్రమశిక్షణ, మొదలైనవి ప్రతి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు. పెద్దలను గౌరవించడం, సమాజం పట్ల అవగాహన విద్యార్థికి అదనపు లక్షణాలు. తాను నేర్చుకున్న విద్యను సక్రమ మార్గంలో పెట్టి విద్యార్జనకు అంతం లేదు అన్నది గ్రహించిన వాడే నిజమైన విద్యార్థి. ఈ దశ కీలకమైనది. క్రమశిక్షణతో చదువు అభ్యసించినపుడే ఉన్నత శిఖరాలను అధిరోహించడం జరుగుతుంది. విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక, కళారంగాలలో రాణించాలి. నేడు విద్యార్థులు సినిమాలు, షికార్లతో కాలం వెళ్లదీస్తున్నారు. నిత్యం వాట్సాప్, పేస్ బుక్, ఇంస్టాగ్రాం, ట్విట్టర్‌లలొ విహరిస్తున్నారు. కాలేజీలకు డుమ్మా కొట్టడం, పార్క్, పబ్బులకు వెళ్లి టైం పాస్ చేయడం, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి, తల్లిదండ్రులను దూషించడం పరిపాటిగా మారింది. జల్సాలకు అలవాటు పడి పార్టీలు చేసుకోవడం, తాగడం, తినడం, పేకాట ఆడడం, బెట్టింగ్ పెట్టడం, జరుగుతుంది. ఓపిక లేకుండా పోతుంది వారికి. నాయకత్వ లక్షణాలు లేకుండా పోతున్నాయి..
విద్యార్థులారా దేశం అంటే మట్టి కాదు మనుషులు. తోటివారిని ప్రేమగా, గౌరవంగా అభిమానించండి. ఒక లక్ష్యంని ఏర్పాటు చేసుకుని దానిని చేరడానికి నిరంతరం కృషి చేయాలి. స్వామి వివేకానంద బోధనలు అధ్యయనం చేయాలి. మహనీయుల గాధలు చదవాలి. వాని నుండి స్పూర్తి పొందాలి. సమాజ సేవ చేయడం అలవాటు చేసుకోండి. పుస్తకాల పురుగుల్లా మారండి. మీ శక్తిని మీరు తెలుసుకోండి..ప్రతీ సెకను విలువ అయినది గా భావించండి. సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి. ఈ దేశం గూర్చి ఆలోచించండి. మంచి మనసుతో ఆలోచించి దేశ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిన బూనండి. పాజిటివ్‌గా ఆలోచన చేయండి. తల్లిదండ్రులు, పెద్దలు, సమాజాన్ని గౌరవించండి. ఈ దేశ భవిష్యత్ మార్చే శక్తి మీలోనే ఉంది.
(నేడు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం)
-కామిడి సతీష్‌రెడ్డి
98484 45134