మూగవోయిన తబలా లయ..

by Aamani |
మూగవోయిన తబలా లయ..
X

తబలా పై సుతి మెత్తగా అవేకళ్ళు కదలాడుతుంటే అ సంగీత రసధ్వని అస్పాదించాల్సిందే. వహ్ ఉస్తాద్ అనాల్సిందే. జాకీర్ హుస్సేన్ వారసత్వం అతని సంగీతం లో మాత్రమే కాదు, సంగీత ప్రియులకు అతను అందించే ప్రేరణలోనూ కనిపిస్తుంది. ప్రముఖ తబలా విద్వాంసుడు అల్లారఖా కుమారుడైన జాకీర్‌ చిన్ననాటి నుంచి తండ్రి బాటలో నడిచి, తబలా మ్యాస్ట్రో గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, జాజ్ ఫ్యూజన్‌లలో నైపుణ్యం కలిగి ఉన్న ఆయన, సంగీత ప్రపంచంలో అపారమైన గౌరవాన్ని పొందారు.

.........................

జాకీర్ హుస్సేన్ 9 మార్చి 1951 న ముంబైలో జన్మించారు. అతని తండ్రి ఉస్తాద్ అల్లా రఖా దేశంలోని ప్రముఖ పెర్కషన్ వాద్యకారుడు. అతను పండిట్ రవిశంకర్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ వంటి గొప్ప కళాకారులతో జుగల్బందీ ప్రదర్శించేవాడు. తన తండ్రి అల్లా రఖా మార్గాన్ని అనుసరించి, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ సంగీతాన్ని తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఆ తర్వాత దానినే తన జీవితంగా చేసుకున్నాడు. జాకీర్ హుస్సేన్ చాలా చిన్న వయస్సు నుండి తబలా నేర్చుకోవడం ప్రారంభించాడు. అతని మొదటి గురువు అతని తండ్రి. జాకీర్ హుస్సేన్ 11 సంవత్సరాల వయస్సులో సంగీత శిక్షణ తీసుకున్నాడు.

సంగీత ప్రయాణం..

జాకీర్ హుస్సేన్ ఒక చైల్డ్ ప్రాడిజీ మరియు అద్భుతమైన కళాకారుడిగా పేరుపొందాడు. తన 60 వ ఏట కూడా, అతను తన పురాణ హోదాను పెంచుకున్నాడు, వేదికపై అతని ప్రదర్శనలకు ఒక అద్భుతమైన ఆనందాన్ని తీసుకొచ్చారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ సంగీత జీవితం గడిపిన జాకీర్ హుస్సేన్ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. అనేక అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేసి తన ప్రతిభతో సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. జాకీర్ హుస్సేన్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన మృదువైన తబలా వాయిద్యం, అపూర్వమైన సంగీత మేళాన్ని సంగీత ప్రియులు ఎప్పటికీ మరిచిపోలేరు.

జాజ్ మరియు రాక్ నుండి ప్రపంచ సంగీతం వరకు విభిన్న శైలులకు చెందిన కళాకారులతో సహకరిస్తూ, శాస్త్రీయ సంగీతం యొక్క సరిహద్దులను అధిగమించగల ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఈ సహకారాలు అతని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడమే కాకుండా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. వేదిక వెలుపల, జాకీర్ హుస్సేన్ వినయం, ఆకర్షణ అతన్ని సంగీత సమాజంలో ప్రియమైన వ్యక్తిగా మార్చింది. అది అతని ఉల్లాసభరితమైన కథలు అయినా లేదా అతని ఇంటర్వ్యూలలో ప్రతిధ్వనించే నవ్వు అయినా... ఎంత అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ తను స్థిరంగా ఉంటారు.

ప్రదర్శనలకు మించిన కృషి..

భారతీయ సంగీతానికి జాకీర్ చేసిన కృషి ప్రదర్శనలకు మించినది. స్వరకర్తగా, అతను 'హీట్ అండ్ డస్ట్', 'వానప్రస్థం' వంటి ప్రశంసలు పొందిన చిత్రాలకు సంగీతాన్ని అందించాడు , తన కంపోజిషన్ల ద్వారా లోతైన భావోద్వేగాలను రేకెత్తించే సామర్థ్యానికి ప్రశంసలు పొందాడు. 'ది పర్ఫెక్ట్ మర్డర్' వంటి చిత్రాలలో అతని కృషి అతని కళాత్మక పరిధిని మరింత ప్రదర్శించింది.

అతని ప్రత్యక్ష ప్రదర్శనలు కేవలం సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించడమే కాదు, వినే వారితో లోతుగా ప్రతిధ్వనించే ఒక ఆత్మీయ సంభాషణ. జాకీర్‌కి, తబలా ఒక వాయిద్యం కంటే ఎక్కువ; ఇది అతని ఉనికి యొక్క పొడిగింపు, ప్రతి బీట్ సంగీతం పట్ల అతని ప్రగాఢ అంకితభావం, ప్రేమను ప్రతిబింబిస్తుంది. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన విశేష కృషి కి గాను ఆయనకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. జాకీర్ తబలా వాద్య నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన బాలీవుడ్ చిత్రాల్లో పాటలకు కూడా పనిచేశారు

పురస్కారాలు..

1990లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు 1988లో పద్మశ్రీ 2002లో పద్మభూషణ్ 2023లో పద్మవిభూషణ్ గ్రామీ విజయాలు: మొత్తం ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్న జాకీర్, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో మూడు పురస్కారాలను కైవసం చేసుకున్నారు. నిజమైన సంగీత మేధావిని కోల్పోయింది. సంగీత ప్రపంచానికి జాకీర్ హుస్సేన్ అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాయి.

ప్రపంచ సాంస్కృతిక ఐక్యత మూర్తి..

తబలా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, సంతాపం తెలియజేశారు. జాకిర్ హుస్సేన్ మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. శాస్త్రీయ సంగీత ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన నిజమైన మేధావి అని కొనియాడారు. 'జాకిర్ హుస్సేన్ మరణం తీవ్ర బాధను కలిగిస్తోంది. భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన నిజమైన మేధావిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. తన అసమానమైన ప్రతిభతో లక్షలాది మందిని ఆకర్షించారు. తబలాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. భారతీయ శాస్త్రీయ సంప్రదాయాలను ప్రపంచ సంగీతంతో మిళితం చేసి సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మారారు. ఆయన ప్రదర్శనలు ఎన్నో తరాల సంగీత విద్వాంసులతో పాటు ఎంతోమంది సంగీత ప్రియుల్లో కూడా స్ఫూర్తినింపాయి. జాకిర్ హుస్సేన్ కుటుంబంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు నా సానుభూతి'.

(తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత సందర్భంగా)

సుధాకర్. వి : 99898 55445

Advertisement

Next Story