- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉపాధ్యాయ బదిలీలతో చిగురించిన ఆశలు
రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయుల పదోన్నతుల, బదిలీల ప్రక్రియకి అనుమతిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి రెండు నెలలకు ప్రమోషన్లు, రెండేళ్లకు బదిలీలు క్రమం తప్పకుండా చేపట్టేవారు. వెనువెంటనే ఆ ఖాళీలు భర్తీచేసేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి బదిలీలకు అనుమతినిచ్చారు. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 25 వేల నుండి 30 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వం గత సంవత్సరం 317 జీఓ ద్వారా కొత్త జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించింది. మొత్తం ఒక లక్ష ఐదువేల మంది ఉపాధ్యాయులలో పాతిక వేల మంది ఉపాధ్యాయులు ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు బదిలీ అయ్యారు. మిగతా వారికి పనిచేస్తున్న చోటే పోస్టింగ్ ఇచ్చారు. అయితే అప్పుడు జరిగినవి జిల్లాల కేటాయింపు, ఇప్పుడు మాత్రం మళ్లీ పాత నిబంధనల ప్రకారం బదిలీలు చేపడుతున్నామని, ఈ బదిలీలకు 2 సంవత్సరాల కనిష్ట, 8 సంవత్సరాల గరిష్ట అనీ పేర్కొంది ప్రభుత్వం.
అది అర్థం లేని నిబంధన
అయితే 317 జీఓ ప్రకారం అందరు ఉద్యోగులను జిల్లాలకి కేటాయించిన ప్రభుత్వం, అందరి సర్వీస్ కాలం ఒకటే అవుతుందని గుర్తించకపోవడం సరికాదు. 317 జీఓ వలన బదిలీ అయిన ఉద్యోగి సర్వీస్ కాలం ఒకటే చేయాలి. అప్పుడే సమన్యాయం జరుగుతుంది. ఎందుకంటే జిల్లాలకి అందరిని కొత్తగా కేటాయించిన ప్రభుత్వం ఇప్పటి బదిలీలలో మాత్రం వేరే నిబంధనలు పేర్కొనడం జరిగింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు నోరు మెదకపోవడం సరికాదు.
ఇప్పుడు టీచర్లందరికీ బదిలీ అవకాశం ఇవ్వాలి. వారికి నచ్చిన చోట, అది ఉమ్మడి జిల్లా అయిన సరే ఖాళీ ఉంటే వెళ్ళే వెసులుబాటు కల్పించాలి. ఇవేమీ పట్టించుకోకుండా 317 జీఓ అమలుచేసి ఇప్పుడు బదిలీలకు 2 సంవత్సరాల సర్వీస్ ఉండాలనడం అర్థం లేని నిబంధన. ఈ జీఓ ప్రకారం బదిలీ అయిన టీచర్లందరికి ఒకే సర్వీస్ కాలం ఇవ్వాలి. ఈ బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ద్వారా 10 వేల మంది లబ్ధి పొందనున్నారు. స్కూల్ అసిస్టెంట్ నుండి గ్రేడ్ హెడ్మాస్టార్లుగా, సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు.
ఆ నోటిఫికేషన్‌పై చిగురించిన ఆశలు..
80 వేల ఉద్యోగ నియామకాల్లో భాగంగా ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి, కొన్నింటికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కానీ టెట్ పరీక్ష ముగిసి 8 నెలలు కావస్తున్నా, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం టీఆర్టీ నోటిఫికేషన్ జారీకి మాత్రం ఆర్థిక శాఖ అనుమతివ్వడం లేదు. దీంతో 4 లక్షల మంది నిరాశలో ఉన్నారు. అలాగే టెట్‌లో ఉత్తీర్ణత పొందని వారు, కొత్తగా డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన వారు టెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరికి కూడా త్వరగా మరొక టెట్ నిర్వహించి టీఆర్టీకి అనుమతివ్వాలి.
టీచర్ల పదోన్నతుల బదిలీ ప్రక్రియ రాబోయే 40 రోజుల్లో పూర్తి చేస్తే, మళ్ళీ కొత్తగా టీచర్ల ఖాళీల వివరాలు వెల్లడి అవుతాయి. అప్పుడు కొత్తవాటికి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వదలిస్తే మేలో టీఆర్టీ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సంవత్సరం క్రితం ఆర్థిక శాఖ అనుమతి కోసం 9600 పోస్టులతో విద్యాశాఖ అధికారులు పంపారు ఇప్పటికీ అది పెండింగ్ లో ఉంది. అందుకే కొత్తపోస్టులను, పాతవాటిని కలిపి ఒక భారీ డీఎస్సీ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. కానీ గతంలో టీచర్ల పదోన్నతులు జరిగితే ఆ ఖాళీలను జిల్లా విద్యాధికారులు బ్లాక్ చేసేవారు. కేవలం రెగ్యూలర్ వేకెన్సీలనే నోటిఫికేషన్ లో పొందుపరిచేవారు. ఇప్పుడు వాటిని కూడా రెగ్యులర్ వేకన్సీలలో చూపెట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
రావుల రామ్మోహన్ రెడ్డి
డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు.
9393059998.
Also Read...