- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ నాన్నా .. నీ మనసే వెన్న
ముసలితనం అనేది వారికి వరంగా మారాలే తప్ప శాపంగా మారకూడదు. మనుమలు, మనుమరాళ్లతో సంతోషంగా కాలం గడిపేలా ఉండాలి. తల్లి, తండ్రికి సంతోషాన్ని పంచడం పిల్లలకు మాత్రమే సాధ్యం. ఇంటి పనులకు సహాయపడుతుందని అమ్మను మాత్రమే పోషించడానికి ఇష్టపడుతున్నారు. నాన్నను పోషించడానికి ఇష్టపడటం లేదు. అమ్మానాన్న తనకున్న పది మంది పిల్లలకు సమాన ప్రేమను పంచి పోషించగలిగారు. కానీ, పది మంది పిల్లలు కలిసి తల్లిదండ్రులను పోషించలేకపోతున్నారు. సర్వస్వాన్ని మనకు అర్పించి, తన వంశాన్ని మన కప్పగించి, మనలను గెలిపించడంకోసం పూర్తిగా ఓడిపోయిన నాన్నను, మన ప్రతి కష్టాన్ని భరించిన అమ్మను ఎప్పటికీ మరువద్దు.
అమ్మ తొమ్మిది నెలలు కడుపులో మోసి కంటే, జీవితకాలం తన బిడ్డలను గుండెలపై మోసేవాడు తండ్రి. బయటకు ఎంత కోపంగా కనిపించినా, మనసులో బోలెడంత ప్రేమను దాచుకుని పిల్లల భవిష్యత్తు కోసం, వారి ముఖంలో చిరునవ్వు కోసం తన వ్యక్తిగత సంతోషాలను కూడా త్యజించే త్యాగమూర్తి నాన్న. పిల్లలు ఎన్ని తప్పటడుగులు వేసినా కూడా వారి కోసమే తపనపడే నిస్వార్థ జీవి. పిల్లల అవసరాలను తీరుస్తూ చదువు, కెరీర్ విషయాలను దగ్గరుండి చూసుకుంటూ, సౌకర్యాలను సమకూర్చడమే తండ్రి జీవిత లక్ష్యం.
బిడ్డలు విశ్వ విజేతలుగా ఎదగటానికి నాన్న పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచమంతా నీకు వ్యతిరేకమైనపుడు, ఓడిపోయినప్పుడు 'మళ్లీ ప్రయత్నం చేయి గెలుస్తావు' అంటూ దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకుంటాడు. భుజం తట్టి మనలో ధైర్యాన్ని నింపుతాడు నాన్న. మనం గెలిచినప్పుడు చిన్న పిల్లాడిలా సంబరపడుతూ పదిమందికి పంచుకొని ఆనందిస్తాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ, లోపాలను సరి చేస్తూ, మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ, మనలను గమ్యం వైపు నడుపుతాడు.
అలా మొదలైంది
పశ్చిమ వర్జీనియాలోని 'మోనోన్ గన్' అనే ఊరిలో బొగ్గు గని ఉండేది. 1907 డిసెంబర్ నెలలో ఒకసారి అనుకోకుండా జరిగిన అసాధారణ పేలుడు వలన భారీగా ప్రాణ నష్టం సంభవించింది. అందులో ఎక్కువ మంది కార్మికులు ఇటలీ నుండి పొట్ట చేత పట్టుకొని వచ్చినవారే. వారి మరణంతో కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కల్పించినప్పటికీ చాలా మంది పిల్లలు తండ్రి లేనివారిగానే మిగిలిపోయారు. మోనోన్ గని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారందరికీ 1908 జులై 18న చర్చిలో ప్రార్థనా సమావేశం నిర్వహించారు. ఆ రోజును ఫాదర్స్ డేగా జరుపుకొన్నారు. సోనారా స్మార్ట్ డేడ్ అనే వనిత తండ్రి మాజీ సైనికుడు. భార్యను కోల్పోయినా, ధైర్యాన్ని కోల్పోకుండా ఆరుగురు పిల్లలను పెంచి పెద్ద చేశారు.
యుద్ధ రంగంలోనూ, కుటుంబ పోషణలోనూ గుండె నిబ్బరంతో, తెగువతో పోరాడాడు. తండ్రి కష్టాలను దగ్గర నుంచి చూసిన సోనారా తండ్రి గౌరవార్థం 1910 జూన్ 19న 'ఫాదర్స్ డే' నిర్వహించింది. అప్పటికే మదర్స్ డే జరుగుతున్నందున 'ఫాదర్స్ డే' కూడా జరపాలని ప్రజలలో చైతన్యం తీసుకొచ్చింది. నాడు అమెరికాలో ప్రారంభమైన 'ఫాదర్స్ డే'ను ఇప్పుడు 52 దేశాలలో జరుపుకుంటున్నారు. 1972లో అప్పటి అమెరికా అధ్యక్షుడు 'ఫాదర్స్ డే'ను అధికారికంగా జరిపారు. కొన్ని దేశాలు వారికి అనుకూల నెలలో డే జరుపుకొంటున్నారు. ఇండియా, అమెరికా మాత్రమే జూన్ మూడవ ఆదివారం జరుపుకుంటున్నాయి.
వారే మనకు దేవతలు
స్పెయిన్, ఇటలీ, పోర్చుగీసు మొదలైన దేశాలు మార్చి 19న, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొదలైన దేశాలు సెప్టెంబర్ నెలలో 'ఫాదర్స్ డే' జరుపుకుంటున్నాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ ఈ నాలుగు మన అర్ష ధర్మానికి మూల సూత్రాలు. తల్లి తర్వాత స్థానం తండ్రికి ఉంది. శిశువుకు అమ్మ ఒడి మొదటి బడి. తల్లి, తండ్రి మొదటి గురువులు. కావ్యాలలోనూ, నాటకాలలోనూ మాతృమూర్తికి ఇచ్చినంత ప్రాధాన్యతను నాన్నకు ఇవ్వలేదు. పిల్లల పుట్టిన రోజులను, వేడుకలను అత్యంత వైభవంగా జరిపి, ప్రతి క్షణాన్ని ఒక జ్ఞాపకంగా నిలుపుతున్న నాన్న ఇంటికి మూల స్తంభం. వారి ప్రేమలో కల్మషం స్వార్థం ఉండదు. పెంపకంలో కొంత కాఠిన్యం ఉన్నప్పటికీ, రేపటి మన భవిష్యత్తు కోసం ఆయన పడే తపన చాలా గొప్పది. అమ్మ తన ప్రేమను ఎన్నో విధాలుగా వెలుబుచ్చుతుంది. కానీ, నాన్న స్పర్శతో తన ప్రేమను వెల్లడిస్తాడు. నాన్న మన ప్రగతికి సోపానం.
బిడ్డలు విదేశాలలో స్థిరపడితే వారి అమ్మ, నాన్న ఆలనా పాలనా వృద్ధాశ్రమాలు చూసుకుంటున్నాయి. వార్ధక్యం వచ్చాక కొంత మంది తల్లి, తండ్రి బిడ్డల చేతిలో అనేక రకాల బాధలకు గురవుతున్నారు. ముసలితనం అనేది వారికి వరంగా మారాలే తప్ప శాపంగా మారకూడదు. మనుమలు, మనుమరాళ్లతో సంతోషంగా కాలం గడిపేలా ఉండాలి. తల్లి, తండ్రికి సంతోషాన్ని పంచడం పిల్లలకు మాత్రమే సాధ్యం. ఇంటి పనులకు సహాయపడుతుందని అమ్మను మాత్రమే పోషించడానికి ఇష్టపడుతున్నారు. నాన్నను పోషించడానికి ఇష్టపడటం లేదు. అమ్మానాన్న తనకున్న పది మంది పిల్లలకు సమాన ప్రేమను పంచి పోషించగలిగారు. కానీ, పది మంది పిల్లలు కలిసి తల్లిదండ్రులను పోషించలేకపోతున్నారు. సర్వస్వాన్ని మనకు అర్పించి, తన వంశాన్ని మన కప్పగించి, మనలను గెలిపించడంకోసం పూర్తిగా ఓడిపోయిన నాన్నను, మన ప్రతి కష్టాన్ని భరించిన అమ్మను ఎప్పటికీ మరువద్దు.
(నేడు ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే)
కొమ్మాల సంధ్య
లెక్చరర్, తాడ్వాయి, ములుగు
91540 68272