మార్పు కోసం మంచి సినిమా!

by Ravi |   ( Updated:2024-08-09 01:00:53.0  )
మార్పు కోసం మంచి సినిమా!
X

ఒకప్పుడు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు, ఆయా చిత్ర దర్శకులు ప్రపంచ నలుమూలల నుంచి మన హైదరాబాద్‌కి తరలి వచ్చి తమ కష్టసుఖాల కలల లోకాన్ని మనకి చూపించేవారు. ఇక అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల సంగతి చెప్పనే అక్కరలేదు. 1955 నుంచి దాదాపు 17సార్లు మన హైదరాబాదే వేదికయింది. ప్రతి రెండేళ్లకొకసారి నవంబర్ 14 నుంచి 20తేదీ వరకు బంగారు ఏనుగు ఆకాశంలో ఎగురుతూ పెద్దల్నీ, పిల్లల్నీ ఊరిం చేది. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన బాలబాలికలతో, నగరమంతా రంగురంగుల సీతాకోకచిలుకలు గాలిలో ఉత్సాహంగా తేలిపోతున్నట్లు వెలిగిపోయేది. బాల దర్శకులు నిర్మించిన చిత్రాలొచ్చేవి.

ప్రభుత్వాలు ఇంతగా గిడసబారిపోయాయా?

బాలల జ్యూరీ సభ్యులు పెద్ద ఆరిందాలలాగా ముచ్చటగా మంచి సినిమాలను ఎంపిక చేసేవారు. చిన్నపిల్లలే కదా అని ఏ సినిమాకి అవార్డులొస్తాయి అని అడిగితే “అది జ్యూరీ రహస్యం”, చెప్పం అని గడుసుగా జవాబిచ్చేవారు! ఓపెన్ ఫోరంలో ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అడిగే ప్రశ్నలకు సినిమాటోగ్రఫీ మంత్రి, ప్రభుత్వ పెద్దల తలలు దిమ్మెక్కిపోయేవి! బహుశా అందుకే మొత్తానికే ఎసరుపెట్టి ఎత్తేశారేమో! ప్రపంచంలోకెల్లా ఎత్తైన విగ్ర హాలు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పనికిమాలిన ఎన్నో పనులతో డబ్బు వ్యర్ధంగా ఖర్చు చేయగలిగిన ప్రభుత్వాలు తల్చుకుంటే భావి భారత పౌరుల కోసం విజ్ఞానాన్నందించే అర్ధవంతమైన మంచిసినిమాలు నిర్మించడానికి బాలల సినిమా నిర్మాతలను ప్రోత్సహించలేవా? నిజం గా ఇది మనందరి దురదృష్టం!

ఫిల్మ్ క్లబ్‌లు గత చరిత్రేనా?

సారధీ స్టూడియోలో ప్రత్యామ్నాయ సినిమాల ప్రదర్శన గురించి ఏమైందో గాని హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్‌లో కూడా సినిమాలను ప్రదర్శించే అవకాశం లేదని ఆయన జీవితమంతా సమాం తర సినిమా ప్రచారం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రకాష్ రెడ్డి చాలా నిరాశగా, ఆవేదనగా మాట్లాడారు. యూరప్, జర్మనీ, మొదలైన దేశాలనుంచి నుంచి వాళ్ల ఫిల్మ్‌ని హైద రాబాద్‌కి తీసుకొస్తామని ప్రకాష్ రెడ్డిని అడుగుతుంటే ఆయన ఏమీ చేయలేక నిస్సహాయంగా ఫీలవుతున్నానని చెప్పారు. ప్రభుత్వానికి మంచి ఆలోచనలొచ్చి పూనుకునే వరకు మనకు మంచి సినిమాలు చూసే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇలాంటి సమయం లో కోల్‌కతా పీ పుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్లు ఐకా బాలాజీ ప్రోత్సాహంతో ఈ ఆదివారం మధ్యాహ్నం మనకోసం ప్రదర్శిస్తున్నారు.

అరుదైన లఘు చిత్రాల ప్రదర్శన..

కోల్‌కతా పీపుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే 40 మంది ఔత్సాహికులైన సమాజ మార్పుకోసం పరితపించే యువతీ-యువకులు! వాళ్లు ప్రజల స్నే, హార్ధిక, ఆర్థిక సహకారంతో ఎంత బాధ్యతతో, శ్రద్ధగా నిబద్ధతతో పనిచేశారో చూడాలంటే మీరు నెక్స్ట్ జరగబోయే కోల్‌కతా పీపుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లవలసిందే! సరే, ఇప్పుడైతే ఆగస్టు 11న అంటే ఆదివారం మధ్యాహ్నం తర్వాత 3 గంటలకి ఛాంప్స్ సి.ఎ. అకాడమీ, 11-6-865, మెహ బూబ్ రెసిడెన్సీ, ఎఫ్.టి.సి.సి.ఐ మా ర్గ్, ప్రగతి ఆఫ్ సెట్ ప్రింటర్స్ పక్కన, హరినగర్, రెడ్ హిల్స్, లక్డీకపూల్ హైదరాబాద్ అడ్రస్‌కి వచ్చేయండి. మన రెస్పాన్స్‌ని బట్టి కోల్‌కతా పీపుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వారు తర్వాత సినిమాలు మనకి తెచ్చి చూపించే ఏర్పాట్లు చేయవచ్చు. కనీసం మనచేతుల్లో ఉన్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుం దాం. అందరికీ రకరకాల బిజీ పనులు ఉండవచ్చు. కొంచెం వీలు చేసుకుంటారని ముందే చెప్పాలని నా ఈ ప్రయత్నం.

మనకోసం ఎంపిక చేసిన సినిమాలు

ప్రతీక్ శేఖర్ దర్శకత్వం వహించిన చై దర్బారి

తథాగత ఘోష్ దర్శకత్వం వహించిన పాదముద్రలు

విక్రమ్ బోలెగావే దర్శకత్వం వహించిన మహాసత్తా

ఆనంద్ పాండే దర్శకత్వం వహించిన మిస్సింగ్ సీన్స్ 6.12.1956

సాక్షి గులాటి దర్శకత్వం వహించిన నియాన్

ఉమా చక్రవర్తి దర్శకత్వం వహించిన జైలు డైరీస్

అస్మిత్ పఠారే దర్శకత్వం వహించిన టూ వే స్ట్రీట్

సాను కుమ్మిల్ దర్శకత్వం వహించిన ది అన్ నోన్ కేరళ స్టోరీస్

శ్రేయాస్ దశరథే మరియు జంషెడ్ ఇరానీ దర్శకత్వం వహించిన వైరల్

(పిల్లలకి సైన్స్ సినిమాలు చూపించాలంటే ఆగస్టు 10th న ప్రగతినగర్ లోని స్కూల్స్ కి తీసుకెళ్ళాలి)

శివలక్ష్మి

రచయిత, సినీ సమీక్షకురాలు

94418 83949

Advertisement

Next Story

Most Viewed