అసమానతలపై ప్రశ్నించిన- మూక్ నాయక్

by Ravi |   ( Updated:2023-01-31 02:08:49.0  )
అసమానతలపై ప్రశ్నించిన- మూక్ నాయక్
X

మాజంలో తీవ్రమైన అంటరానితనం, మరోవైపు అణచివేతలు, ఎటువంటి హక్కులు లేకుండా.. ఊరవతల బతుకులు, పశువుల కంటే హీనంగా బతుకుతున్న వారి బతుకులను మార్చడానికి అవిరామంగా వారి హక్కుల కోసం అంబేడ్కర్ కృషిచేశారు. మరోవైపు వారి బతుకులలో వెలుగులు తేవడానికి 103 సంవత్సరాల క్రితం 1920 జనవరి 31 న 'మూక్‌నాయక్' పత్రిక స్థాపించారు. దేశంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్న, ప్రశ్నించకుండా ఉన్న సమాజానికి నాయకుడిగా మూక్‌నాయక్ పత్రిక ద్వారా వారి సమస్యలను, వారి జీవితాలను వ్యాస రూపంలో ప్రచురిస్తూ పరిష్కార మార్గాలను చూపడానికి కృషి చేశారు.

దళితలు దుర్భర జీవితాలపై, నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులపై ఆయన నిత్యం మూక్‌నాయక్ పత్రికతో చైతన్యాన్ని రగిలించారు. దళితుల తరపున మాట్లాడటానికి కూడా ఇష్టపడని ఆ కాలంలో వారి పరిస్థితులపై అనేక రచనలు రాశారు. అయితే అంబేద్కర్ నడుపుతున్న ఈ పత్రికకు ఎవరూ అంతగా సహకరించలేదు. దీంతో ఆర్థిక సమస్యలు వచ్చి కేవలం మూడేళ్ళలోపే మూక్‌నాయక్ మూతపడింది. అంబేద్కర్ సైతం ఉన్నత చదువులకు ఇతర దేశాలకు వెళ్ళారు. ఆ తరువాత 1927 కాలంలో 'బహిష్కృత భారత్' పత్రిక స్థాపించి మరోసారి వారి జీవితాలను, బాధలను, అనాటి పరిస్థితులపై చైతన్యాన్ని రగిలించారు. ఈ పత్రికకు సైతం ఇబ్బందులు ఏర్పడి ఇది మూసివేశారు. దేశంలో జరుగుతున్న సామాజిక ఉద్యమాలకు మీడియా ప్రధాన వేదిక కావాలని అంబేద్కర్ అభిప్రాయం ఆ అభిప్రాయంతోనే పత్రికలు ఏర్పాటు చేసి దళిత జాతికి జరుగుతున్న అన్యాయాలపై కథనాలు రాసి కదలికలు తెచ్చారు. దళిత ఉద్యమాలతో పాత్రికేయ రంగానికి విడదీయరాని బంధముంది. దళితుల సామాజిక, రాజకీయ ఉద్యమాలు ప్రతిబింబించేలా వారు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక పత్రికల్లో కవరేజీ ఉండేది. అయితే, అంబేడ్కర్ కాలం లానే నేటికీ ప్రధాన పత్రికల్లో దళితులకు సంబంధించిన అనేక విషయాల్లో సముచిత స్థానం దక్కడం లేదు. అంబేద్కర్ స్ఫూర్తితో దళిత సమాజం కోసం మూక్‌నాయక్ వంటి పత్రికలు రావాల్సి‌న అవసరం ఎంతైనా ఉంది.

సంపత్ గడ్డం

7893303516

Also Read...

కార్పొరేషన్లతో బీసీలకు ఒరిగిందేంటి? ఒరిగేదేంటి?


Advertisement

Next Story