- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందువుల మనోభావాలను గాయపరచకండి!
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా హిందూ వ్యతిరేక పాలన కొనసాగుతోంది. పోలీసుల తీరు రజాకార్లను గుర్తు చేస్తోంది. ముఖ్యంగా హిందూ దేవి దేవతలకు రక్షణ కరువైపోయింది. ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా పదుల సంఖ్యలో రాష్ట్రంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోంది.
ఇదే అదునుగా ఇటీవల కాలంలో హిందూ వ్యతిరేక శక్తులు రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై దాడులు చేస్తూ.. విగ్రహాలను ధ్వం సం చేస్తున్నాయి. దుండగులు బరితెగించి ప్రవర్తిస్తూ... దేవాలయాలను అపవిత్రం చేస్తు న్నారు. పండుగలను లక్ష్యంగా చేసుకొని హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నారు. ప్రణాళిక బద్ధంగా హిందు త్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం కొనసాగిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరం.
ఈ దాడులు పిచ్చివాళ్ల పనా?
దాడికి పాల్పడ్డ దోషులకు మద్దతు పలు కుతూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు హిం దువుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరే హోం శాఖ కూడా ఉన్నప్పటికీ వరుస దాడుల ఘటనపై స్పందించకపోవడం బాధాకరం. పైగా దేవాలయాలపై, విగ్రహాలపై దాడులు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సింది పోయి.. వారిపై పిచ్చివారిగా సర్టిఫికెట్ జారీ చేయడంతో హిందుత్వంపై రెట్టింపు స్థాయి లో దాడులకు ప్రేరేపిస్తున్నట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. దుండగులు దొంగలని, పిచ్చివారని, ఆకలితో ప్రసాదం కోసం వచ్చారనే కట్టు కథలు హింసా వాదులకు మరింత బలాన్ని చేకూరుస్థాయనడంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రంలోని శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్న అసాంఘిక శక్తుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తూ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరించడం అప్రజాస్వామికం. ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేయా ల్సిన ప్రభుత్వం.. ఉదాసీనంగా వ్యవహరించి ఓట్ల కోసం ఆత్రం పడటం తగదు.
మందిరాలపై మూకుమ్మడి దాడులు..
భాగ్యనగరంలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గం సంతోష్‌నగర్ రక్షాపురంలో హిం దూ వ్యతిరేక శక్తులు అర్ధరాత్రి సమయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు. గోషామహల్ నియోజకవర్గంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దుర్గా నవరాత్రి ఉత్సవాల సంద ర్భంగా ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సికింద్రాబాద్ కుమ్మరి వాడలో గల ముత్యాలమ్మ మందిరంలో అ మ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంబ ర్‌పేటలో మహంకాళి అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు. పంజాగుట్టలో పోచమ్మ తల్లి విగ్రహం ధ్వంసం చేశారు. యాకత్‌పుర నియోజకవర్గంలోని హిందువుల ఐక్యతను చాటే వీడియో స్టేటస్‌లో పెట్టుకున్నందుకు బ్రాహ్మణివాడి బస్తీలో కిషన్ యాదవ్ అనే బాలుడిని చంపేందుకు కుట్ర చేశారు. మూ కుమ్మడిగా బాలుడి ఇంటిపై దాడి చేసి తీవ్రం గా చితకబాదారు. తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేశారు. అయినప్పటికీ బాధిత బాలుడి పైనే కేసు నమోదు చేశారు. కానీ దాడి చేసిన వ్యక్తుల పై ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం నగర పోలీసుల ప్రత్యేకత. రాష్ట్రవ్యాప్తంగా కూడా అనేక ఘటనలలో దేవతా విగ్రహాల ధ్వంసం కార్యక్రమాలు, అధికారులు కూడా హిందువులపైనే దాడులు చేయడం హిందూ యువకులపై జిహాదీ మూకలు దాడికి పాల్పడినా అధికార యంత్రాంగం చూస్తూ ఊరకుండిపోవడం జరుగుతోంది.
భద్రత గాలికొదిలేసి..
అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుకొని ఉన్న శంషాబాద్‌లో కూడా హిందూ దేవాలయాలు దాడులకు గురవుతున్నాయి. శంషా బాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో నవగ్రహాలను ధ్వంసం చేశా రు. అయితే, అలవాటులో భాగంగా ఆ విగ్రహాలను కూడా పిచ్చివాడే ధ్వంసం చేశాడని పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వడం గమ్మత్తైన విషయం. ప్రభుత్వం హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటోంది అనడానికి ఇం తకు మించిన సాక్ష్యం మరోటి లేదు.
ఆ పోలీసులను సస్పెండ్ చెయ్యాలి!
భాగ్యనగరంలో పోలీసులు మరీ ఘోరంగా వ్యవహరిస్తున్నారు. హిందువులను రకరకాల కేసులలో ఇరికించి వేధింపులకు గురి చేస్తు న్నారు. హిందూ వ్యతిరేక కార్యకలాపాలు శిక్షణ పొందిన వాళ్ల పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా, భక్తులపై లాఠీఛార్జ్ చేసి హిందువులను భయభ్రాంతులకు గురిచేయడం గర్హనీయం. పోలీసు శాఖ సికింద్రాబాద్‌లోని మెట్రో పాలీస్ హోటల్లో ఉగ్రవాద శిక్షణ పొందిన దాదాపు 150 మందిని అరెస్టు చేయడంలో ఘోరంగా విఫల మైంది. ఇది పోలీసుల పనితనానికి నిదర్శనంగా చెప్ప వచ్చు. చట్టాన్ని ఉల్లంఘించి సికింద్రా బాద్‌లో లాఠీ చార్జీ చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. దేవాలయాలపై వరుస దాడులు నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలి. దోషు లను గుర్తించి, వెంబడే కఠినంగా శిక్షించాలి.
పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్, వీహెచ్‌పీ తెలంగాణ
9912975753