- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రచారాలను నమ్మి మోసపోవద్దు!
ప్రజలు తమను తాము పాలించుకునే గొప్ప అవకాశం ఒక్క ప్రజాస్వామ్యంలోనే ఉంది. అంతటి శక్తివంతమైన ఓటు అనే అస్త్రాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. లేకుంటే అంతకుమించిన అపరాధం మరొకటి లేదు. ప్రజాస్వామ్య దేశంలో ఇదే అన్ని మతాల సారాంశం. అన్ని వర్గాల ప్రజలు, తమ ప్రార్థనా మందిరాలకు వెళ్లి తమ కష్టాలు తీరాలనే కోరికలు కోరుకుంటారు. కానీ ఇవన్నీ సాధించుకోవడానికి లౌకిక రాజ్యంలో, ప్రజాస్వామ్యం వ్యవస్థలో బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన విలువనిచ్చే ఓటు హక్కును కల్పించారు. దాన్ని సరిగ్గా వాడుకుంటే మంచి నాయకులు అసెంబ్లీకి వెళ్తారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. అయితే, ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఇన్నాళ్లు కాలు కింద పెట్టని నాయకులు ఏసీ గదులు, బంగ్లాలు, అట్టహాసాలు వదిలి గల్లి గల్లి తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ఓటర్లకు దండాలు పెడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్న విలువ అలాంటిది. ఇంత ప్రాధాన్యత ఉన్న ఓటుపై కొందరు అయిష్టత చూపుతుంటారు. ఆరోజు వేతనంతో కూడిన సెలవు దినం కావడంతో ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇది తప్పు! పోలింగ్ రోజు ఎన్ని పనులు ఉన్నా తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవాలి. దీనిపై ఎన్నికల సంఘంతో పాటు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చైతన్యం కల్పించాలి.
ప్రచార పంథాను మార్చి
ఒకవైపు రాజకీయ పార్టీలు ఓటర్ను ఎన్నో విధాలుగా ప్రలోభ పెట్టి ఓట్లు పొందడానికి నానా ఎత్తులేస్తుంటారు. ఆ భ్రమలో పడకుండా చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రచార, ప్రసార సాధనాల ద్వారా, సామాజిక మాధ్యమాలతో ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పార్టీలు అనేక మార్గాలు ఎంచుకుంటున్నాయి. వీటి భ్రమలో పడకుండా ఓటరు చైతన్యంతో ప్రజల అవసరాలు తీర్చే నైతిక విలువలతో కూడిన వ్యక్తు(పార్టీ)లను వారికి నచ్చిన వారికి వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసేది ప్రచారం. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఈ ప్రచారం సాదాసీదాగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రచారం అంటేనే గొంతెత్తి, గజ్జె కట్టి చిందులేయడాలు, బతుకమ్మలు పేర్చి- ఆడడాలు, బోనం ఎత్తడాలు, కోలాటాలు. రాష్ట్రంలో ఎన్నికల వేళ అన్ని పార్టీలు ఆ వేడుకలను ప్రచార ఆర్భాటానికి వాడుకుంటున్నాయి. ఇలా ఎన్నికల ప్రచార పంథాను మార్చేశారు. అన్ని రాజకీయ పార్టీలు పాటలను తమ ప్రచారాస్త్రాలుగా ఎంచుకున్నాయి. అధికార పార్టీ వారు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను, ప్రతిపక్షాలు పాలకపక్షం వైఫల్యాలను ప్రస్తావిస్తూ పాటల బాణీలు కట్టి జన సామాన్యంలోకి పంపుతున్నారు. వీటిని చూసి ప్రజలు మోసపోకుండా, మీ నియోజకవర్గంలోని ఏ నాయకుడు మీకు మంచి చేస్తాడో చూసి వారికి మీ అమూల్యమైన ఓటును వేయాలి.
దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే సాంఘిక, ఆర్థిక సమానత్వం సాధించాలని రాజ్యాంగం లక్ష్యం. రాజకీయ ప్రజాస్వామ్యం సామాన్యులకు అందకపోతే బాధితులు ఈ రాజ్యాంగ వ్యవస్థను కూల్చేస్తారని, 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని పార్లమెంటుకు సమర్పిస్తూ అంబేద్కర్ హెచ్చరించారు. అందుకే రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలంటే దానికోసం పోరాడే వారిని ఓటు వేసి గెలిపించుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ఓటు విలువని తెలుసుకొని ప్రలోభాలకు లోనుకాకుండా చైతన్యవంతులై మీ ఓటు వజ్రాయుధాన్ని ఉపయోగించుకోవాలి..
మేకిరి దామోదర్
95736 66650