సెల్‌ఫోన్ బడిపిల్లలను నాశనం చేస్తుంది

by Ravi |   ( Updated:2024-05-27 04:37:38.0  )
సెల్‌ఫోన్ బడిపిల్లలను నాశనం చేస్తుంది
X

దూరం ఉన్నవాళ్లు మాట్లాడుకోవడానికి పుట్టిన మొబైల్ ఫోన్ ఇప్పుడు బహుళ ప్రయోజనకారి అయిపోయింది. సెల్‌ఫోన్ ఇప్పుడు ఒక బ్యాంక్, ఒక కెమరా, ఒక పోస్టాఫీస్, సినిమా తెర, ఒక పాటల పెట్టి, ఒక రెడియో, ఒక టీవీ, మరోక సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం, ఇలా ఒకటేమిటి ఇందులో లేనిది ఏమి లేదు. ఇది లేకుండా ఎవరికైనా ఒక్క నిమిషం కూడా ఎల్లని స్థితి అన్ని వర్గాల వారికి దాపురించింది. అన్ని పనులు అందులోనే ఉండేవరకు సెల్ రహితంగా జీవించలేని స్థితి వచ్చింది. దీంతో ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ.. మరెన్నో నష్టాలు ఉన్నాయి.

గంటలు గంటలు ఫోన్ చూసి..

పెద్దవాల్లకు సరేసరి బడిపిల్లలను ఫోన్ వెంటాడుతుంది. ఐదు పది పదిహేను ఏండ్ల పిల్లలకు ఫోన్ చూడటం అలవాటై వదిలి ఉండటం లేదు. ఎండాకాలం సెలవుల్లో ఇతర సమయాల్లో ప్రతి అబ్బాయి లేదా అమ్మాయి సెల్‌ఫోన్ తీసుకుని అందులో గేమ్స్ అడుతున్నారు. బీటీఎస్, బ్లాక్ పిక్ మ్యూజిక్ బాండ్ ఆల్బమ్స్ చూస్తున్నారు. కొందరు ఇన్ స్టాలో రీల్స్ చేస్తున్నారు. పిల్లలకు కొరియాకు చెందిన మ్యూజిక్ గ్రూప్ క్రియేట్ ఉన్నది. ఇట్లా తల్లి దగ్గర తండ్రి దొరుకుతే తన దగ్గర లేదా అమ్మమ్మ తాతల దగ్గర స్మార్ట్ ఫోన్ మెల్లిగా తీసుకని దూరం కూచొని గంటలకు గంటలు ఫోన్‌లో ఈ ఆటలు ఆడుతున్నరు. వద్దని నివారిస్తే ఎవరూ వినడం లేదు. పైగా పెద్దల మీదనే మర్లపడుతున్నారు. ఇదొక మ్యానియా అయింది. నిజానికి ఈ తరం పిల్లలు మైదానంలో క్రీడల్లో పాల్గొనాల్సి ఉంది. లేదా కళాసాహిత్య రంగాల్లో రాణించాల్సి ఉంది. కానీ ఏడ చూసిన ఎవరిఇళ్లు చూసినా పిల్లలు సెల్‌ఫోన్‌లో తలపెట్టి పైకి తీస్తలేరు. ఇదంతా కరోనా కాలం తర్వాత ఆన్‌లైన్ క్లాస్‌ల ద్వారా పిల్లలకు అబ్బిన జబ్బు. పిల్లల మెడలు వంచి గంటలకు గంటలు చూసి చూసీ మెడ వెనకు ఉబ్బెత్తుగా అయి నొప్పులు లేస్తున్నాయి. కండ్లు చూసి చూసీ అలసిపోతున్నాయి. అయినా ఒక మత్తులాగా అలవాటై విద్యార్థులు హోంవర్క్ కానీ ఇంట్లో ఏదైనా పని నేర్చుకోవడం గానీ చేయడం లేదు.

చంటి పిల్లలకు తినిపించేందుకు సెల్‌ఫోన్‌లో పాటలు పెట్టి మరిపిస్తు అన్నం తినిపిస్తున్నారు. చందమామ రావే జాబిల్లి రావే అంటూ అదిగో చందమామ అనుకుంట పూర్వకాలంలో చూపిస్తే ఈ కాలంలో సెల్‌ఫోన్‌లో, యూట్యూబ్‌లో రీల్స్ చేస్తున్నారు. ఇది మంచిదే కావచ్చు తినేందుకు ఉపాయమే కావచ్చు. కానీ ఆ తర్వాత ఆ పిల్లవాడు ఆ సెల్‌ఫోన్ తీసుకొని తానే స్వయంగా లేవకుండా చూస్తున్నారు. దీనివల్ల శరీర ధారుడ్యత లేకపోగా బయట ఆడే ఏ ఆటలు ఆడడం రావడం లేదు. ఇంటికి వచ్చిన అతిధిని కూడా పలకరించడం లేదు. ఎవరితోనూ మాట్లాడుకుండా ఫోన్ లోకంలోనే మునిగిపోతున్నారు. రారా నానా తినురా అంటే ఆగు వస్తున్న అనుకుంటూ సెల్‌లోనే తలకాయ పెట్టి రావడం లేదు.

దీనికి పరిష్కారం లేదా?

ఈ ట్రెండ్ తీవ్రంగా ప్రబలుతుంది దీనికి విద్యావేత్తలు, మానసిక వైద్యులు, సమాజ శ్రేయస్సును ఆలోచించేవాల్లు, పిల్లల వైద్యులు, ఆర్థోపెడెక్ వైద్యులు ఆలోచించి సెల్‌కు దూరంగా ఉండటం వల్ల ప్రచారం చేయాలి. ఆ తరం ఇంకో పదిహేను ఇరవై ఏండ్ల తర్వాత ఎట్లా తయారు అవుతో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సెల్‌ఫోన్ వల్ల అందులో సోషల్ మీడియా ఫ్లాట్ వల్ల విశ్రాంత జీవులకు కొంత ఉపయోగం ఉండవచ్చు. కానీ సృజన రంగంలో పనిచేస్తున్న వారికి పెద్ద నష్టమే సంభవిస్తుంది. రాసేవాల్లు ఇదివరకటి లాగా రాయడం లేదు. సోషల్ మీడియా చూడటం వల్ల సమయం వృధా అవుతుంది. అట్లని చూడకుంటే కూడా సమాచార సమయం వృధా అవుతుంది. అట్లని చూడకుంటే కూడా సమాచార సమన్వయం లేక నష్టం జరుగుతుంది. దేన్ని అయిన ఉపయోగించుకున్న తీరులోనే ఉంటుంది. కానీ పసిపిల్లలకు సెల్‌నుంచి రక్షించాల్సి ఉంది. ఈ విషయం ప్రభుత్వం కూడా పట్టింపు చేసికోవాల్సిన అవసరం ఉంది.

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story