టీఆర్‌ఎస్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

by Shyam |   ( Updated:2021-06-14 02:56:36.0  )
టీఆర్‌ఎస్ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ ఎస్ నేత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. నామా ఆఫీసుల్లో, ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టారు. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారని నామా పై వచ్చిన అభియోగాలతో ఈడీ అధికారులు సోదాలు ప్రారంభించారు. మధుకాన్ గ్రూప్ సంస్థలు సహా ఐదు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి.

Advertisement

Next Story