అలస్కా పీఠభూమిలో కంపించిన భూమి..

by vinod kumar |   ( Updated:2020-07-22 21:00:14.0  )
అలస్కా పీఠభూమిలో కంపించిన భూమి..
X

దిశ, వెబ్ డెస్క్: అలస్కా పీఠభూమిని భారీ భూకంపం సంభవించింది. ఉదయం 6:12 గంటలకు ఆంకోరేజ్‌కు నైరుతి దిశగా 800 కిలోమీటర్లు, పెర్రివిలేకు ఆగ్నేయంగా 96 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు భూకంపం కేంద్రం నుంచి సుమారు 300 కిలోమీటర్ల వరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

సముద్ర తీర ప్రాంతాల్లోని వారితో పాటు దీవుల్లో, దిగువ ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. భూకంప తీవ్రత, ఇతర ప్రమాణాలను బట్టి ప్రమాద కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రమాదరకరస్థాయిలో అలలు దూసుకువచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. భూకంపం తర్వాత కూడా చాలా సేపటి వరకు అలలు సాధారణంగానే ఉండటంతో సునామీ హెచ్చరికలను ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed