నా బేబీ గాళ్ గానే ఉండిపో.. హ్యాపీ బర్త్ డే మేరీ : దుల్కర్

by Shyam |
నా బేబీ గాళ్ గానే ఉండిపో.. హ్యాపీ బర్త్ డే మేరీ : దుల్కర్
X

దుల్కర్ సల్మాన్ కు కూతురు మేరీ అంటే ప్రాణం. తనతో సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతాడు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తనతో ఎంజాయ్ చేసిన ప్రతీ మోమెంట్ ను అభిమానులతో షేర్ చేసే దుల్కర్… బేబీ తనకు ఎంత స్పెషల్ అనేది చెప్తూనే ఉంటాడు. తనకు సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తూనే ఉంటాడు. కాగా మే 5న తన చిన్నారి కూతురి పుట్టినరోజు కావడంతో స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

హ్యాపీ బర్త్ డే డార్లింగ్ మేరీ… నీ రాకతో మమ్మల్ని చిన్నపిల్లలను చేసేశావు.. నీ వయసుకి తగినట్లు నటించేలా మార్చేశావు.. నువు ఇప్పుడు అనుకుంటున్నావు నేను పెద్ద అమ్మాయిని అయిపోయా అని.. అవును నువ్వు కరెక్ట్ అనుకుంటా. తొందరగా పెరుగుతున్నావు.. వాక్యాలు స్పష్టంగా మాట్లాడుతున్నావు.. ఇప్పుడు నీకు మూడేళ్లు వచ్చేశాయి. యువరాణి డ్రెస్ లలో తిరుగుతున్నావు.. నీకు నువ్వే గేమ్స్ క్రియేట్ చేసుకుంటున్నావు .. మాకు కథలు చెప్తున్నవు..నీకు నువ్వుగా నడుస్తున్నావు.. పరుగెడుతున్నావు.. ఎలా జంప్ చేయాలో నేర్చుకుంటున్నావు.

కానీ మేరీ కాస్త నెమ్మదిగా ఉండు.. బేబీ లాగే ఉండిపో అమ్మా… నేను తొలిసారి నిన్ను చూసినప్పుడు ఎలా ఉన్నావో అలా .. ఈ దేవతను చూసేందుకు ఎలా పరుగెత్తుకు వెళ్లానో ఇంకా అలాగే గుర్తుంది.. ఎప్పటికీ ఆ బేబీ గాళ్ లాగే ఉండిపో.. ఒకవేళ ప్రపంచం మొత్తం మేరీ పెద్దమ్మాయి అయిపోయిందని చెప్పినా నమ్మొద్దు సరేనా.. హడావిడిగా పెరిగి పెద్దగా అయిపోకుండా నా చిట్టి పాపలాగే ఉండాలని కోరుకుంటున్న అంటూ పోస్ట్ పెట్టారు దుల్కర్ సల్మాన్.

View this post on Instagram

Happiest birthday darling Marie. You’ve got every one of us acting your age while you insist, “Im a big girl now!” Maybe you’re right. You’re fast growing up, speaking in full sentences now. 3 years old you’re a big girl now. Twirling in your princess dresses. Creating your own games now. Telling us stories, you’re big girl now. Walking on your own. Running now. Learning how to jump, you’re a big girl now. Slow down darling Marie, be a baby still. Like the day we saw you for the first time. Held you and heard your cries for the first time. The day they thronged the hallways, to meet an angel for the first time. Be that baby girl still, we havnt had enough. Though forever more you’re our baby. Even when the world says, she’s a big girl now. Don’t rush, darling Marie, stay our baby girl still. #pappasattemptatapoem #youhavethateffectonus #happymaryamday #myangelbaby #cantbelieveit #youarethreeyearsold #loveyoutothemoonandback #ourbabygirl

A post shared by Dulquer Salmaan (@dqsalmaan) on


Tags: Dulquer Salmaan, Marie, Birthday, Wishes

Advertisement

Next Story

Most Viewed