- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దుబాయ్ మాల్ రీ ఓపెన్
దిశ, వెబ్ డెస్క్ : కరోనా లాక్‌డౌన్ వల్ల మూతపడ్డ ప్రపంచంలోనే అతి పెద్ద మాల్‌గా పేరుపొందిన ‘దుబాయ్ మాల్’ను శుక్రవారం తిరిగి ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి కారణంగా దుబాయ్‌లో మార్చి 23 నుంచి లాక్‌డౌన్ విధించారు. దీంతో అన్ని మాల్స్, సినిమా హాళ్లు మూతపడ్డాయి. దాదాపు నెల రోజుల తర్వాత మాల్ తెరుచుకోవడంతో ‘వెల్‌కమ్ బ్యాక్’ అని రాసి ఉన్న నల్ల టీషర్ట్‌లు వేసుకున్న మాల్ సిబ్బంది ప్రతి ఒక్కరికి టెంపరేచర్ చెక్ చేస్తూ, వెల్‌కమ్ చెప్పారు. కరోనా నుంచి ఇంకా ప్రపంచం పూర్తిగా బయట పడలేదు… కానీ కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో ఆంక్షలతో కూడిన సడలింపులకు తెరతీశారు. దుబాయ్ మాల్ కూడా అలానే ఓపెన్ అయ్యింది. . కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాల్‌కు వచ్చే వారికి కొన్ని షరతులు విధించారు. మాల్‌కు వచ్చే కస్టమర్స్ మాస్క్ ధరించడంతో పాటు…మాల్ పార్కింగ్, ఎంట్రన్స్ లో ఫీవర్ పరీక్షలు చేయించుకోవాలి. మాల్ లో మూడు గంటలకు మించి ఉండటానికి వీలు లేదు. మాల్ లో ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. వినియోగదారులు రూల్స్ పాటిస్తూ లేదా తెలుసుకోవడానికి మాల్ నిర్వహాకులు టెక్నాలజీని వాడుకుంటున్నారు. సోషల్ డిస్టెన్స్ విషయంలో వాళ్లను మానిటర్ చేస్తున్నారు. మూడేళ్ల నుంచి 12 ఏండ్లు, అరవై ఏళ్లు పైబడిన వారికి మాల్‌లోకి అనుమతిలేదు. మాల్ ను మధ్యాహ్న 12 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంచుతున్నారు. మాల్ లోని ప్రేయర్ రూమ్స్, చేంజింగ్ రూమ్స్ తో పాటు.. సినిమాహాళ్లను మాత్రం మూసే ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.
Tags : corona virus, lockdown, dubai mall, uae,