- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఆస్పత్రిలో డ్రైఫ్రూట్స్ గణేషుడు
దిశ, వెబ్ డెస్క్: సూరత్ లో ఓ వింత సందర్భం చోటు చేసుకుంది. అది కూడా కొవిడ్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రికి చెందిన డాక్టర్ ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిపెట్టుకుని సందేశాత్మకంగా గణేషుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చ నడుస్తోంది.
కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో సూరత్ లో వినాయక చవితి ఏర్పాట్లపై అక్కడి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే, ఓ డాక్టర్ మాత్రం వెరైటీగా ఆలోచించాడు. అనుకున్నదే తడువుగా తాను పని చేస్తున్న కొవిడ్ ఆస్పత్రిలో డ్రైఫ్రూట్స్ తో ఓ విగ్రహాన్ని తయారు చేశాడు. దానిని ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేశాడు.
బాదం, పైన్ కాయలు, వేరుశనగ, జీడిపప్పు లాంటి డ్రైఫ్రూట్స్ ను వాడి 20 అంగుళాల వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశాడు. అనంతరం దానిని ఆస్పత్రిలో ప్రతిష్ఠించాడు. అయితే, మరో విశేషమేమంటే.. ఈ వినాయకుడి విగ్రహాం నిమజ్జనానికి బుదులుగా ఆ డ్రైఫ్రూట్స్ ను వేరు చేసి అనంతరం వాటిని ఆస్పత్రిలోని రోగులకు పంచనున్నారు.