- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్‌న్యూస్: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు
దిశ, తెలంగాణ బ్యూరో: భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగిన విషయం ఒకతరం వారందరికీ తెలిసిందే. కానీ అవి కాలక్రమేణా కనుమరుగై పోయినా.. ఇప్పుడు మళ్లీ పునరుద్దరించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రెడీ చేసింది. గతంలో మంత్రి కేటీఆర్ సూచనతో సిద్ధమైన ఆర్టీసీ.. ఏరూట్లలో బస్సులు తిప్పాలనే అంశంపై ప్రాథమిక రిపోర్టులను రూపొందించింది. డబుల్ డెక్కర్ బస్సులను సొంతంగా కొనుగోలు చేసేందుకే ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీనికోసం తయారీ సంస్థల నుంచి గురువారం నుంచి ఈనెల 11వరకు టెండర్లను స్వీకరించనున్నారు. 2004లో చివరిసారిగా తిరిగిన ఈ డబుల్ డెక్కర్ బస్సులపై గతేడాది అక్టోబర్‌లో ఓవ్యక్తి ట్వీట్ చేయగా మంత్రి కేటీఆర్ స్పందించి.. డబుల్ డెక్కర్ బస్సులు నడిపే విషయంపై ఆలోచించాలని రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సూచించారు.
ఎక్కడెక్కడ నడుపుదాం
తొలిదశలో 10డబుల్ డెక్కర్ బస్సుల్ని నడపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్, కోఠి రూట్, మేడ్చల్ రూట్లోని సుచిత్ర, కొంపల్లి వరకూ నడిపేందుకు ప్రతిపాదనలు పెట్టారు. పాతబస్తీ నుంచి మెహిదీపట్నం-జీడిమెట్ల డబుల్ డెక్కర్ బస్సులను నడుపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ నివేదిక ప్రకారం రూట్ నెం.229 (సికింద్రాబాద్ – మేడ్చల్ వయా సుచిత్ర), రూట్ నెం.219 (సికింద్రాబాద్–పటాన్‌చెరు వయా బాలానగర్ క్రాస్ రోడ్డు), రూట్ నెం. 218 (కోఠి–పటాన్‌చెరు వయా అమీర్‌పేట), రూట్ నెం.9ఎక్స్ (సీబీఎస్–జీడిమెట్ల వయా అమీర్‌పేట), రూట్ నెం.118 (అఫ్జల్‌గంజ్–మెహిదీపట్నం) రూట్లను ఎంపిక చేశారు. వీటితో పాటుగా దుర్గం చెరువుపై కొత్తగా కేబుల్ బ్రిడ్జి మీదుగా ఓ బస్సు తిరిగేలా సూచించారు. డబుల్ డెక్కర్ బస్సులపై అనుమానాల నివృత్తి కోసం ఈ మెయిల్ చేయాలని.. చీఫ్ మెకానికల్ ఇంజినీర్, తెలంగాణ ఆర్టీసీకి స్పీడ్ పోస్టు ద్వారా కూడా పంపవచ్చని అధికారులు సూచించారు. ఈనెల 18న ఉదయం 11గంటలకు ఆసక్తి గల గుత్తేదారులతో ప్రీబిడ్ సమావేశం ఏర్పాటు చేశారు.
1972నుంచి హైదరాబాద్‌లో…!
1972లో తొలిసారి భాగ్యనగరాన్ని చుట్టిన డబుల్ డెక్కర్ బస్సు… జంట నగరాలతో మూడున్నర దశాబ్దాల బంధం కొనసాగించింది. అప్పట్లో ఈ బస్సులు చాలా స్పెషల్గా ఉండేవి. సిటీకి వచ్చిన ప్రతిఒక్కరూ ఆసక్తిగా చూడ్డమే గాక ఒక్కసారైనా అందులో ప్రయాణించాలనుకునేవారు. ఏపీఎస్ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులను పరిచయం చేసింది.