జూమ్ వీడియో కాన్ఫరెన్సులు వద్దు… ప్రభుత్వం సలహా!

by vinod kumar |
జూమ్ వీడియో కాన్ఫరెన్సులు వద్దు… ప్రభుత్వం సలహా!
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ నేపథ్యంలో మీటింగులకు, ఆన్‌లైన్ క్లాసులకు జూమ్ వీడియో కాలింగ్‌ను అందరూ విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే భద్రత విషయంలో ఈ యాప్ అంత పనితీరును కనబరచక పోవడంతో వివిధ దేశాలు ఈ యాప్ వాడకాన్ని నిషేధించాయి. అదే బాటలో భారత ప్రభుత్వం కూడా జూమ్ యాప్ వాడకం మీద పరిమితులతో కూడిన హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వ్యక్తిగత అవసరాల కోసం జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ వాడకాన్ని తగ్గించాలని కేంద్ర హోం శాఖ కోరింది.

అంతకీ ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలనుకునే వారికి కొన్ని సూచనలు జారీ చేసింది. అవి… ప్రతి మీటింగుకి ప్రత్యేక ఐడీ, పాస్వర్డ్ సృష్టించుకోవాలి, వెయింటిగ్ రూం ఎనేబుల్ చేసుకుని మీటింగు హోస్ట్ మాత్రమే వారిని ఒక్కొక్కరిగా అనుమతించాలి, హోస్ట్ మినహా వేరేవారికి మీటింగులోకి ఇతరులను అనుమతించే అవకాశం ఇవ్వొద్దు. ఇంకా స్క్రీన్ షేరింగ్, ఫైల్ షేరింగ్ మీద కూడా హోస్ట్ అధికారం మాత్రమే చలామణిలో ఉండాలి. రికార్డింగును ప్రోత్సహించకూడదు..వంటి సూచనలను విడుదలచేసింది. లాక్‌డౌన్ సమయంలో పెరుగుతున్న సైబర్ దాడులను అరికట్టే నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags – corona, covid, zoom, video calling, threat, MHA

Advertisement

Next Story

Most Viewed