నోబెల్ శాంతికి ట్రంప్ నామినేట్

by Anukaran |   ( Updated:2020-09-09 05:45:52.0  )
నోబెల్ శాంతికి ట్రంప్ నామినేట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ అయ్యారు. నార్వే పార్లమెంట్ సభ్యుడు క్రిస్టియన్ ట్రైబింగ్ జెడ్డే ట్రంప్‌ను నామినేట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోసం అమెరికా అధ్యక్షుడు కృషి చేశారని ఆయన ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఇజ్రాయిల్, యూఏఈ మధ్య ఒప్పందం కుదర్చేందుకు కృషి చేశారని.. ఇరు దేశాల మధ్య సామరస్యం నెలకొనేలా డొనాల్డ్ మధ్య వర్తిత్వం వహించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ను నామినేట్ చేసినట్టు వెల్లడించారు.

డైనమైట్ ఆవిష్కర్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం.. ప్రముఖ రంగాల్లో విశిష్ఠ సేవలను అందించిన వారికి ప్రతి ఏటా ఈ అవార్డు ఇవ్వడం ఆనవాయితీ. ఇందులో శాంతి (Peace), సాహిత్యం (Literature), భౌతికశాస్త్రం (Physics), రసాయన శాస్త్రం (Chemistry), ఆర్థిక శాస్త్రం (Economics), ఔషధరంగాల్లో (Pharmaceutical) ఉత్తమ ప్రయోజనాలను ప్రపంచానికి అందజేసిన వారికి ఈ అవార్డును నార్వేలో అందజేస్తారు.

Advertisement

Next Story