పీపీఈ కిట్స్ ఇవ్వండి..సింగరేణి ఆస్పత్రిలో డాక్టర్ల నిరసన

by Sridhar Babu |

దిశ, కరీంనగర్ :
తెలంగాణ ప్రభుత్వం వైద్యుల కోసం అందిస్తున్న సౌకర్యాలు, భద్రతను తమకు కూడా కల్పించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రి యంత్రాంగం బుధవారం నిరసన చేపట్టారు. ఇటీవల ఆస్పత్రిలో ఇద్దరు కరోనా పాజిటివ్ పేషెంట్లు కలియ తిరిగారని, వారిని వెంటనే క్వారంటైన్ చేయాలని అడిగినట్టు తెలిపారు. అంతకు ముందు సింగరేణి డైరక్టర్ (పా)ను కలిసి రూ.50 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఇన్సెంటివ్ కూడా ఇవ్వాలని కోరినట్టు వివరించారు. అయితే గోదావరిఖనిలో కోవిడ్-19 కేసులు లేవు కదా, నిర్దారణ అయిన వారు చేరితే చూద్దామని యజమాన్యం బదిలిచ్చిందన్నారు. ప్రస్తుతం పాజిటివ్ కేసులు వచ్చినందున ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్లు సమకూర్చి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి అవసరం ఉందన్నారు. ఆస్పత్రిలో ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం అందుబాటులో ఉంచి, ఇక్కడికి మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు చెందిన పేషెంట్లు వస్తారని వారిని కట్టడి చేసేందుకు కృషి చేయాలన్నారు. సింగరేణి ఆస్పత్రిలో స్టాఫ్ తక్కువగా ఉన్నందున విడుతల వారిగా విధులు అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారిని నిర్దారించలేని పరిస్థితి ఉన్నందున, ఆస్పత్రిని మూసి వేయాలన్న ప్రతిపాదన సింగరేణి అధికారుల ముందు ఉంచామని వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed