- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యుల నిర్లక్ష్యం.. పేషంట్ చనిపోయాడంటూ ఫోన్
దిశ, హైదరాబాద్: వైద్యో నారాయణో హరి… అంటే వైద్యుడు నారాయణుడితో సమానమని అర్థం. అలాంటి వైద్యులకు సమాజంలో మంచి గౌరవం ఉంది. దానిని మంట గల్పేలా కొంత మంది వ్యవహరిస్తుండడం వైద్యులందరికీ మచ్చ తెస్తోంది. బతికున్న వారిని చనిపోయారని చెప్పడం, చనిపోయిన వారు బతికున్నారని వైద్యం చేసినట్టు నటించి డబ్బులు లాగడం వంటివి పరిపాటిగా మారింది. ఇలాంటి సంఘటనే హైదరాబాద్ నగరంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పరిచయం ఉన్న ఓ రాజకీయ పార్టీ నాయకునికి జరిగింది. వివరాలలోకి వెళితే.. అంబర్ పేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకులు సి.నర్సింగరావు 12 రోజుల క్రితం కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు అతన్ని వైద్య చికిత్సల నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో చేర్పించారు. నాటి నుంచి ప్రతి నిత్యం అక్కడ తెలిసిన డాక్టర్ల కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు తెలుసుకునేవారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో అశోక్ కుమార్ అనే డాక్టర్ నర్సింగరావు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మృతిచెందినట్టు తెలిపారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోగా నర్సింగరావు భార్య ఏకంగా గుండె పోటుకు గురి కావడంతో ఆమెను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నర్సింగరావు మృతి పట్ల విచారం సైతం వ్యక్తం చేశారు.