వ్యాక్సిన్ కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి

by Shyam |
వ్యాక్సిన్ కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్:
కోవిడ్ వ్యాక్సిన్ కొద్ది నెలల్లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న సిబ్బంది తమ వివరాలను వెంటనే ఆన్ లైన్‌లో నమోదు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా వైద్య , ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జే. వెంకటి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం గురు , శుక్ర వారాల్లో జిల్లాలోని అన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యులు, సిబ్బందితో జూమ్ సమావేశాలు నిర్వహించి ఆన్ లైన్‌లో పేర్ల నమోదు కోసం విధి, విధానాలను రూపొందించినట్లు తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది కోవిడ్ బారిన పడకుండా ముందస్తుగా వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25 లోగా సిబ్బంది తమ వివరాలను తప్పనిసరిగా ఆన్ లైన్ చేయాలని కోరారు. హైదరాబాద్ జిల్లాలోని ఆస్పత్రుల యాజమాన్యం వారి ఆస్పత్రుల వివరాలను cova dmho [email protected] వెబ్ సైట్ లో , googlesheetలో ఆస్పత్రి వివరాలు , సిబ్బంది సంఖ్యను నమోదు చేసినట్లయితే వారి మెయిల్ ఐడీకి ఒక టెంప్లెట్ పంపిస్తామని తెలిపారు. అందులో ఆస్పత్రిలో పని చేసే వైద్యులు, సిబ్బంది వివరాలు నమోదు చేయాలని డాక్టర్ వెంకట్ సూచించారు.

Advertisement

Next Story