- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గంజాయి వనంలో తులసి మొక్కలు ఈ రూపాయి డాక్టర్లు
దిశ,వెబ్‌డెస్క్: చాలా మంది డాక్టర్లు వైద్య వృత్తిని బిజినెస్ గా మార్చుకుంటున్నారు. కానీ గంజాయి వనంలో తులసి మొక్కలా ఆయన మాత్రం అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పల్లెల్లో తిరుగుతూ రూపాయికే వైద్య సేవల్ని అందిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రూపాయి డాక్టర్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ రాజకీయాల్లోకి రాకముందు ఒక్క రూపాయి డాక్టరుగా పేరు ప్రఖ్యాతలు గడించారు. 1974లో వైఎస్‌ఆర్ తండ్రి వైఎస్ రాజారెడ్డి పులివెందుల్లో ఆస్పత్రిని నిర్మించారు. అదే సమయంలో వైఎస్ డాక్టర్ గా జమ్మలమడుగు గ్రాంబెల్ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉండేవారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించేవారు. రూపాయి మాత్రమే ఫీజుండేది. అనంతరం వైఎస్ 1978లో ప్రజాసేవకోసం రాజకీయ ప్రవేశం చేశారు.
తాజాగా ఒడిశాకు చెందిన ఓ ఎంబీబీఎస్ ప్రజలకు కేవలం రూపాయితోనే వైద్య సేవలందిస్తున్నారు. ఒడిశాలోని సంబర్ పూర్ జిల్లాకు చెందిన శంకర్ రామచందాని సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఓ వైపు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూనే స్థానికంగా ఉన్న బూర్లా అనే గ్రామంలో క్లీనిక్ ఏర్పాటు చేశారు. కేవలం రూపాయి ఫీజుతో పేదలకు వైద్య సేవలను అందిస్తున్నారు. శంకర్ రామచందాని భార్య డాక్టర్ సిఖా డెంటల్ సర్జన్ కాగా ఆమె కూడా భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ పేదలకు రూపాయికే వైద్య సేవలను అందిస్తూ.. భర్తకు తగ్గ భార్య అనిపించుకున్నారు. రూపాయి ఫీజు ఎందుకు ఉచితంగా వైద్య సేవలను ఇవ్వచ్చు కదా అని ఎవరైనా అడిగితే.. తాము ఫ్రీగా సేవ చేసుకుంటున్నామని భావన ఉండకూడదనే ఉద్దేశంతో రూపాయి ఫీజు తీసుకుంటున్నామని ఈ దంపతులు చెబుతున్నారు.