ఉదయం అరెస్టు..రాత్రికి పరారీ!

by srinivas |   ( Updated:2020-02-12 22:42:32.0  )
ఉదయం అరెస్టు..రాత్రికి పరారీ!
X

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిని పోలీసులు ఉదయం అరెస్టు చేయగా అతడు రాత్రికి పరారయ్యాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా పోలీస్‌స్టేషన్‌లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..నెల్లూరు జిల్లా ఉదయగిరి పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రవీంద్ర తన తోటి సహోద్యోగులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్నిఅదుపులోకి తీసుకున్నారు.అంతకుముందు బాధితుల కుటుంబసభ్యులు రవీంద్ర మీద దాడికి పాల్పడ్డారు. పీఎస్‌లో పోలీసుల రక్షణ వలయాన్నిచేధించుకుని వైద్యుడు తప్పించుకోవడంతో పోలీసుల మీద పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed