- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RBI: ట్రంప్ విధానాలతో ఆర్‌బీఐ రేట్ల తగ్గింపుపై ప్రభావం
దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకునే విధానపరమైన చర్యలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నివేదిక అభిప్రాయపడింది. ట్రంప్ విధానాల చుట్టూ ఉన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపునకు ఆటంకం కలిగించవచ్చని నివేదిక పేర్కొంది. దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని నివేదిక అంచనా వేసినప్పటికీ, ఆహార పదార్థాల ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని స్పష్టం చేసింది. ట్రంప్ అధికార బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్ణయాలు, పన్ను పెంపు కారణంగా వడ్డీ రేట్లను తగ్గించడం కొంత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా ఉండనుంది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల స్టాక్స్, బాండ్లపై ఒత్తిడి కలిగించవచ్చు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోనున్నారు. ఇన్ని సవాళ్ల మధ్య కూడా ఆర్‌బీఐ 2025లో వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నివేదిక అంచనా వేసింది. ద్రవ్యోల్బణం నిర్దేశించిన లక్ష్యం 4 శాతానికి దగ్గరగా ఉన్నందున రేట్లను 50-75 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని వెల్లడించింది.