- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమాచారముంది దర్యాప్తు చేయండి: డీజీపీకి విజయసాయి లేఖ
ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై విచారణ జరిపించాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. మాజీ ఎస్ఈసీ రాసిన లేఖ ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో టీడీపీ ఆఫీస్‌లో తయారైందన్న సమాచారం ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, వర్ల రామయ్య, టీడీ జనార్థన్‌ల హస్తముందని, వారే ఉద్దేశ్యపూర్వకంగా లేఖను తయారు చేయించారని ఆయన ఆరోపించారు. ఈ తతంగమంతా రమేష్ కుమార్‌కి తెలిసే జరిగిందని ఆయన, లేఖపై విచారణ జరిపించాలని డీజీపీని కోరారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. అలాగే ఆ లేఖను మెయిల్ చేసిన ఐపీ ఆధారంగా దానిని ఎవరు పంపారో తెలుసుకోవాలని సూచించారు.
Tags: ap, ysrcp, vijayasairedy, tdp, sec, nimmagadda ramesh kumar