- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘నీట్’ రద్దుకు మద్దతివ్వండి.. కేటీఆర్‌ను కలిసిన డీఎంకే ఎంపీలు
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నీట్‌పరీక్ష రద్దుకు మద్దతు తెలపాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాశారు. అందులో భాగంగా బుధవారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీలు ఎలన్గోవన్, ఎరా స్వామిన్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అందించాల్సిన లేఖను మంత్రి కేటీఆర్‌కు అందించారు. అనంతరం ఇద్దరు ఎంపీలు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నీట్ పరీక్ష రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని అన్నారు. అందుకే అన్ని రాష్ట్రాల సీఎంలకు తమ పోరాటానికి మద్దతు తెలపాలని లేఖలు రాస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం కీలకమైన విషయాల్లో రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడంలేదని, అందుకే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేశారు.