డీఎంకే ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఏకగ్రీవం..!

by Shamantha N |
డీఎంకే ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఏకగ్రీవం..!
X

దిశ, వెబ్‎డెస్క్:

డీఎంకే ప్రధాన కార్యదర్శిగా దురైమురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో తమిళనాడు మాజీ మంత్రి దురైమురుగన్, మాజీ కేంద్ర మంత్రి టీఆర్ బాలునను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా యూనిట్ల నుంచి పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పదవుల కోసం పార్టీ సభ్యుల నుంచి దరఖాస్తులను గత వారం ఆహ్వానించారు. కాగా దురైమురుగన్, బాలు మినహా ఎవరూ దరఖాస్తు చేయలేదు.

Advertisement

Next Story