ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి సెరేనా ఔట్

by Shyam |
Serena Williams
X

దిశ, స్పోర్ట్స్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నోవాక్ జకోవిచ్ బరిలోకి దిగనున్నాడు. జనవరి 17 నుంచి 30 వరకు సిడ్నీలో ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వహించనున్నారు. తాజాగా ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల వివరాలను నిర్వాహకులు విడుదల చేశారు. మహిళల సింగిల్స్ మాజీ నెంబర్ వన్ సెరేనా విలియమ్స్ గాయం కారణంగా ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. ఇక తాజాగా విడుదల చేసిన లిస్టులోని ఆటగాళ్లు, సిబ్బంది, అధికారులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. వారు వ్యాక్సిన్ వేయించుకున్నారా లేదా అనేది ముందుగా నిర్వాహకులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా వైద్య పరమైన ఇబ్బందుల కారణంగా వ్యాక్సిన్ వేయించుకోకపోతే.. వారికి మాత్రం మినహాయింపు ఇస్తారు. ఈ నిబంధనల ప్రకారం ప్రస్తుతం జకోవిచ్‌కు మినహాయింపు ఇచ్చారు. అయితే అందరిలాగానే 14 రోజుల క్వారంటైన్‌లో మాత్రం ఉండాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో 108 మంది పురుషులు, 104 మంది మహిళా టెన్నిస్ ప్లేయర్లు పాల్గొననున్నారు.

Advertisement

Next Story