నిరుపేదలకు బియ్యం పంపిణీ

by Shyam |
నిరుపేదలకు బియ్యం పంపిణీ
X

దిశ, మెదక్: ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన సేవ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్‎లో శనివారం మధ్యాహ్నం మమ్మారే చర్చి ఆధ్వర్యంలో 300 మంది నిరుపేదలకు మంత్రి చేతుల మీదుగా ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సేవా భావంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మమ్మారే చర్చి ఫాస్టర్ స్టీవెన్ జ్ఞాన్ కుమార్, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు ఆనంద్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని మంత్రి కొనియాడారు.

Advertisement

Next Story