ఇవాళ్టి నుంచి నూతన పింఛన్ల పంపిణీ

by srinivas |   ( Updated:2020-06-30 21:25:55.0  )
ఇవాళ్టి నుంచి నూతన పింఛన్ల పంపిణీ
X

దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ఫించన్లను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1.15 లక్షల మంది అర్హులకు ఈ నెల నుంచి పెన్షన్లు ఇవ్వనున్నారు. ఈ కొత్త ఫించన్లు తీసుకునేవారిలో 5,165 మంది హెల్త్ పెన్షనర్లు ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 59.03 లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు తెలిసింది. పెన్షన్ల కోసం రూ. 1442.21 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story