జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ

by Shyam |   ( Updated:2020-04-12 05:48:27.0  )
జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ
X

దిశ, హైదరాబాద్: తెలంగాణ ప్రెస్ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ ఆదివారం జర్నలిస్టులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. మాసబ్‌ట్యాంక్‌లో 1200 మంది జర్నలిస్టులకు నిత్యావసరాలతోపాటు 10 కిలోల బియ్యం చొప్పున అందజేశారు. కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిత్యం విధుల్లో ఉంటున్న మీడియా ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెంజు ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, టీయూడబ్ల్యూజే హైదరాబాద్‌ అధ్యక్షులు యోగానంద్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

tag: Telangana Media Academy, TWJ, Distribution Rice, Corona Effect

Advertisement

Next Story