కదిలారు..ఆకలి తీర్చారు

by  |
కదిలారు..ఆకలి తీర్చారు
X

– దిశ ఎఫెక్ట్

దిశ, మహబూబ్‌నగర్: కృష్ణాజిల్లా కైకలూరు మండలం గూడెంకు చెందిన 80 మంది వలస కార్మికులు డ్యామ్లో రిజర్వాయర్లో చేపలు పట్టేందుకు వచ్చి చిక్కుకుపోయారు. వారికి తీనేందుకు తిండి, చేయడానికి పని లేక అవస్తలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక మాగనూర్ తాసిల్దార్ దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటాన్ని దిశ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు వంట సరుకులు అందజేసేందుకు ముందుకు వచ్చాయి. నేరేడుగొమ్ము గ్రామంలోని శ్రీ నివృత్తి మఠంలో 80 మంది వలస కార్మికులకు వంట సరుకులను శనివారం ఉదయం అందజేశారు. దిశ వెలుగులోకి తెచ్చిన వార్తతో నేరడ గ్రామస్తులు, టీచర్ల సంఘాలు, అమ్మ స్మారక ట్రస్ట్‌లు వలసకార్మికులకు నిత్యావసరాలు అందజేస్తూనే ఉన్నారు. తమ కష్టాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన దిశకు వందనాలు తెలిపారు.

Tags; Mahabubnagar,migrants,Essential goods,Distribution

Advertisement

Next Story

Most Viewed