YSRCP : వైసీపీ ఎమ్మెల్యేపై కేసులు ఎత్తివేత.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

by srinivas |   ( Updated:2021-05-29 01:22:03.0  )
YSRCP : వైసీపీ ఎమ్మెల్యేపై కేసులు ఎత్తివేత.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభానుపై ఉన్న పలు కేసులు ఎత్తివేస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆయనపై వివిధ దశల్లో విచారణలో ఉన్న 10 కేసులను ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయభానుపై జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు పోలీసు స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి.

డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ఈ కేసులను ఉపసంహరించుకున్నట్లు హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కేసుల ఎత్తివేతకు జిల్లాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశించింది.

Advertisement

Next Story