కౌశిక్ రెడ్డి ఎరక్కపోయి ఇరుక్కున్నారా..?

by Shyam |
కౌశిక్ రెడ్డి ఎరక్కపోయి ఇరుక్కున్నారా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి ఎరక్కపోయి ఇరుక్కున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఆదివారం సాయంత్రం కౌశిక్ రెడ్డి తనతో మాట్లాడంటున్న విజయేందర్ రెడ్డి తాను ఈటల అభిమానని చెప్తున్నారు. కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన విజయేందర్ రెడ్డితో కౌశిక్ మాట్లాడిన ఆడియో లీక్ అయిన విషయం తెలిసిందే. అయితే విజయేందర్ రెడ్డి తాను ఈటల రాజేందర్ అభిమానినని, కౌశిక్ రెడ్డి తనకు ఫోన్ చేసింది వాస్తవమేనని చెప్పారు.

కౌశిక్ రెడ్డికి ఒకప్పుడు అనుచరునిగా ఉన్న విజయేందర్ రెడ్డి ఇటీవలే ఈటలకు మద్దతుగా బీజేపీలో చేరారు. ఈ విషయం తెలియని కౌశిక్ ఆయనకు ఫోన్ చేసి తలనొప్పి కొని తెచ్చుకున్నారని హుజురాబాద్ ప్రాంత వాసులు అంటున్నారు. తన సెకండ్ కేడర్ ఎటువైపు వెళ్తుందో కూడా తెలుసుకోకుండా కౌశిక్ రెడ్డి అతనితో మాట్లాడడం వల్లే ఇంతదూరం వచ్చిందని స్పష్టం అవుతోంది.

Advertisement

Next Story