సామ్-చై విడాకులు.. ఏం జరిగింది?.. నిరంకుశులు, హంతకులెవరు?

by Shyam |
సామ్-చై విడాకులు.. ఏం జరిగింది?.. నిరంకుశులు, హంతకులెవరు?
X

దిశ, సినిమా: సమంత అక్కినేని మళ్లీ సమంత రుత్‌ప్రభు అయిపోయింది. నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు అఫిషియల్‌గా ప్రకటించిన సామ్.. అంతకు ముందు చేసిన పోస్ట్ ద్వారా డివర్స్ తీసుకునే నిర్ణయం వెనుక బలమైన కారణం ఉందనే చెప్పాలని అనుకుందని అంటున్నారు అభిమానులు. ‘అమ్మచెప్పింది#MyMommaSaid’ హ్యాష్ ట్యాగ్‌తో ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన సామ్.. తనలో ఎన్నో రకాల ఎమోషన్స్, హిడెన్ ట్రూ‌త్స్ నింపుకున్నట్లు చెప్పకనే చెప్తున్నట్లు కనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. సత్యం, ప్రేమ మార్గం ఎల్లప్పుడూ గెలుస్తుందని చరిత్ర ద్వారా తెలుసుకున్నానని అమ్మ చెప్పిందని.. నిరంకుశులు, హంతకులు ముందుగా అజేయంగానే అనిపించవచ్చు కానీ చివరకు ఓడిపోతారని, దీని గురించి ఆలోచించాలని సూచించింది.

ఇప్పుడు ఈ పోస్ట్‌పైనే సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతుండగా.. పెళ్లి అయినప్పటి నుంచి అక్కినేని, దగ్గుబాటి వారి ఫంక్షన్లలో చాలా హ్యాపీగా కనిపించిన సామ్‌ ఎందుకంత బాధపడుతుంది అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా నిరంకుశులు, హంతకులు అని మెన్షన్ చేయడంపై డిస్కషన్‌ కాస్త హీటెక్కగా.. ఎవరు అంతగా హింసించారు? ఎవరు ఆ హంతకులు? అని ప్రశ్నిస్తున్నారు. అక్కినేని కోడలిగా హోదా పొందిన సామ్ నిజంగా లక్కీ అనుకున్న ఫ్యాన్స్.. నాగ్, చై, అఖిల్, అమల, చై తల్లి… ఇలా అందరితోనూ చాలా సన్నిహితంగా, అందరూ ప్రేమించే అందమైన కోడలిగా ఫొటోస్, మీడియా, స్పెషల్ షోస్‌లోనూ కనిపించింది కదా ఇదంతా నిజం కాదంటారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ డిస్కషన్ పక్కనపెడితే సామ్-చైల డివర్స్ గురించి నాగ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సామ్-చైల మధ్య ఏదైతే జరిగిందో అది చాలా దురదృష్టకరమన్న నాగ్… భార్యాభర్తల మధ్య జరిగిన ఇన్సిడెంట్ వెరీ పర్సనల్ అని అభిప్రాయపడ్డాడు. కానీ సామ్ -చై ఇద్దరు తను ఎక్కువగా ప్రేమించే వ్యక్తులని తెలిపాడు. సామ్‌తో గడిపిన క్షణాలను అక్కినేని ఫ్యామిలీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్న నాగ్.. ఆమె ఎప్పటికీ తమకు డియర్ వన్‌గా నిలిచిపోతుందన్నాడు. వారిద్దరికి భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

సిద్దార్థ్ ట్వీట్..

మరోవైపు సమంత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ కూడా ఈ వ్యవహారానికి సంబంధించి రివెంజ్ టైప్ లో ట్వీట్ చేశాడు. ‘పాఠశాలలో టీచర్ నుంచి నేను నేర్చుకున్న మొదటి పాఠాలలో ఒకటి … మోసగాళ్లు ఎప్పటికీ అభివృద్ధి చెందలేరు’ అని కామెంట్ చేసాడు.

Advertisement

Next Story

Most Viewed