సంచలన దర్శకుడు.. RGV ఇంట్లో తీవ్రవిషాదం

by Anukaran |   ( Updated:2021-05-23 21:13:27.0  )
Director RGV brother Somasekhar
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్రపరిశ్రమలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారినపడి కోలుకోగా.. పలువురు పరిస్థితి విషమించి మరణిచారు. తాజాగా.. నిత్యం సోషల్ మీడియాలో ఏదోఒక సంచలనం సృష్టిస్తూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ ఇంట్లో కరోనా మహమ్మారి తీవ్ర విషాదం నింపింది. కరోనాతో ఆర్జీవీ సోదరుడు పి.సోమశేఖర్‌ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. కాగా, సోమశేఖర్ రంగీలా, దౌడ్‌, సత్య, జంగిల్‌, కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్‌ బాధ్యతలను నిర్వర్తించారు. హిందీలో ‘ముస్కురాకే దేఖ్‌ జరా’ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఆ చిత్రానికి అనురాగ్‌ కశ్యప్‌ స్ర్కీన్‌ప్లే అందించారు. ఈ సినిమా అనంతరం ఆయన వేరే వ్యాపారాల్లోకి వెళ్లడం వల్ల వర్మకు దూరంగా ఉన్నారు. తన జీవితంలో కీలకమైన వ్యక్తుల్లో సోమశేఖర్‌ ఒకరని ఆర్జీవీ పలుమార్లు చెప్పడం గమనార్హం.

Advertisement

Next Story