పాకిస్థాన్ కస్టడీలోకి దిలీప్ కుమార్, రాజ్‌ కుమార్ ఇండ్లు

by Shyam |
Dilip Kumar, Raj Kapoor
X

దిశ, సినిమా: పాకిస్థాన్, పెషావర్‌లోని కిసా ఖ్వానీ బజార్ ఏరియాలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ దిలీప్ కుమార్, రాజ్ కపూర్‌‌కు చెందిన పురాతన గృహాలు మ్యూజియంగా మారనున్నాయి. ఈ క్రమంలో రాజ్ కపూర్‌కు సంబంధించిన కపూర్ హవేళితో పాటు దిలీప్ కుమార్‌కు చెందిన వందేళ్ల చరిత్ర కలిగిన హవేళిని పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్షియల్ ప్రభుత్వం అధికారిక కస్టడీలోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ గృహాలను మ్యూజియంగా మార్చే క్రమంలో ప్రస్తుత యజమానులకు నోటీసులు జారీ చేసింది. పెషావర్ డిప్యూటీ కమిషనర్ ఖలీద్ మహమూద్ బుధవారం ఈ చారిత్రాత్మక భవనాల యజమానులకు తుది నోటీసులు జారీ చేశారు.

కాగా ఖైబర్ పఖ్తున్ఖ్వా (కేనీ) ప్రభుత్వం నిర్ణయించిన హవేలీ ధరలపై యజమానులు తమ రిజర్వేషన్లను సమర్పించవచ్చు. ఆ తర్వాత గృహాల ధరలను పెంచాలని ప్రాంతీయ ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశించవచ్చు. గతంలో, కపూర్ పురాతన ఇంటికి రూ. 1.50 కోట్లు, దిలీప్ కుమార్ గృహానికి రూ. 80 లక్షల ధర నిర్ణయించింది కేపీ ప్రభుత్వం. కానీ కపూర్ హవేళీ యజమాని అలీ ఖాదిర్ రూ. 20 కోట్లు డిమాండ్ చేయగా, రాజ్ కుమార్ ఇంటి యజమాని గుల్ రెహమాన్ మహమూద్ రూ. 3.50 కోట్ల మార్కెట్ రేటుకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed