నిలకడగా దిలీప్‌కుమార్ ఆరోగ్యం

by Shyam |   ( Updated:2020-03-14 01:13:30.0  )
నిలకడగా దిలీప్‌కుమార్ ఆరోగ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ యాక్టర్ దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు సతీమణి సైరా భాను. వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆయనను ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో జాయిన్ చేశామని.. చికిత్స అనంతరం బాగున్నారని తెలిపారు. దేవుడి దయ, మీ ఆశీర్వాదం వల్ల అంతా సవ్యంగా జరిగిందన్నారు.

97 ఏళ్ల దిలీప్ కుమార్ ఈ మధ్య కాలంలో తరుచు అనారోగ్యానికి గురవుతున్నారు. లీలావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అందుకే దిలిప్ కుమార్ ట్విట్టర్ ఎకౌంట్ నుంచి తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆడియో మెస్సేజ్ సెండ్ చేశారు సైరా భాను. కాగా 1998లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘ఖిలా’లో చివరిగా కనిపించారు దిలీప్ కుమార్.

tags : Dilip Kumar, Saira Banu, Mumbai, Lilavati Hospital

Next Story

Most Viewed