మోసం చేస్తున్నారనిపిస్తే.. డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి

by Shyam |
మోసం చేస్తున్నారనిపిస్తే.. డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి
X

దిశ, నల్లగొండ: నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని, తాలు ఉందనే అంశాలను సాకుగా చూపిస్తూ రైతులకు మద్దతు ధర చెల్లించకుండా మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ డీఐజీ రంగనాథ్ హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా నాణ్యత సరిగా లేదని, ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉన్నదని, తాలు, మట్టి ఎక్కువ ఉన్నదని రైతులు తీసుకొస్తున్న ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుండా మోసం చేస్తు్న్నారని రైతుల వద్ద నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు.

రైతులు తీసుకొవచ్చిన ధాన్యంలో నాణ్యత లేకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యాన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయించిన విధంగా ధర చెల్లించాలని తెలిపారు. అలా కాకుండా నాణ్యత, మాయిశ్చర్, తాలు సాకుగా క్వింటాలుకు కొన్ని కిలోలను తగ్గింపు లాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేయడంతో పాటు సంబందిత మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవకతవకలు జరిగినా, మోసం చేసేందుకు ప్రయతించినా రైతులు నేరుగా తన మొబైల్ 9440795600 కు వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా లేదా సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన రైతులను కోరారు.

Advertisement

Next Story